News February 3, 2025

ప్రభుత్వ స్కూళ్లలో తగ్గుతున్న అడ్మిషన్లు.. సర్కార్ కీలక నిర్ణయం

image

TG: ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సర్కార్ విద్యాసంస్థల్లో అందిస్తున్న సౌకర్యాలు, వస్తున్న ఫలితాల గురించి ప్రజలకు తెలిసేలా వివరించనుంది. అడ్మిషన్లు పెరిగేలా చర్యలు చేపట్టనుంది. దీనికోసం FB, X, WHATSAPP వంటి సోషల్ మీడియా వేదికల్లో స్పెషల్ గ్రూపులను క్రియేట్ చేయనుంది. వీటిని స్పెషల్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తారని సమాచారం.

Similar News

News December 28, 2025

TET: 500 కి.మీ. దూరంలో సెంటర్లు

image

TG: టెట్ పరీక్ష కేంద్రాల కేటాయింపుపై అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని కొందరు అభ్యర్థులకు ఖమ్మంలో సెంటర్లు కేటాయించారు. దాదాపు 500KMకు పైగా దూరం ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తమకు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలని పరీక్ష రాసే ఇన్ సర్వీస్ టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఆలస్యంగా అప్లై చేసుకున్న వారికే దూరంగా సెంటర్లు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.

News December 28, 2025

దానిమ్మ తోటలపై క్రాప్ కవర్ వల్ల లాభాలేమిటి?

image

కొన్నిచోట్ల దానిమ్మ చెట్లపై తెల్లని కవర్ గమనించే ఉంటారు. వీటినే క్రాప్ కవర్స్ అంటారు. వీటిని ప్లాస్టిక్+నైలాన్‌తో తయారు చేస్తారు. ఈ కవర్ వల్ల పండు ఈగ, ఇతర చీడపీడల నుంచి పంటకు రక్షణ లభిస్తుంది. అలాగే మొక్క, కాయలపై అధిక ఎండ, చలి తీవ్రత పడకుండా ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. నేలలో తేమను నిలకడగా ఉంచి కలుపు బెడదను తగ్గిస్తుంది. ఫలితంగా తెగుళ్లు, మచ్చలు లేని నాణ్యమైన పంటతో పాటు అధిక ఆదాయం పొందవచ్చు.

News December 28, 2025

150 పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

image

<>RITES<<>>లో 150 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.29,735 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.300, SC, ST, PwBDలకు రూ.100. వెబ్‌సైట్: https://rites.com