News February 3, 2025
కోదాడ స్కూల్ నుంచి స్టూడెంట్స్ పరార్.. పట్టుకున్న పోలీసులు

కోదాడ మం. నెమలిపురి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు పారిపోవడం ప్రభుత్వ యంత్రాగాన్ని పరుగులు పెట్టించింది. ఎస్సై అనిల్ రెడ్డి వివరాలు.. పాఠశాల నుంచి ఆరుగురు విద్యార్థులు పారిపోగా ప్రిన్సిపల్ ఝాన్సీ PSలో ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారిని విజయవాడలో ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థులను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి కారణాలు అడిగి తెలుసుకున్నారు.
Similar News
News January 23, 2026
మేడారంలో 5,700 టాయిలెట్ల ఏర్పాటు!

మేడారానికి వచ్చే లక్షలాదిమంది భక్తుల సౌకర్యం కోసం 5,700 టాయిలెట్లను అధికారులు ఏర్పాటు చేశారు. 285 టాయిలెట్ బ్లాకులుగా ఏర్పాటు చేసి, వీటిని పరిశుభ్రంగా నిర్వహించేందుకు 255 మంది సిబ్బందిని నియమించారు. ప్రధాన ఆలయ పరిసరాలు, జాతీయ రహదారి, పార్కింగ్ ప్రాంతాల్లో, గ్రామాల నుంచి వచ్చే దారులు, చెరువుల సమీపంలో టాయిలెట్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
News January 23, 2026
జగిత్యాల జిల్లాలో మూడు రోజుల పాటు నీటి సరఫరా బంద్

మెట్పల్లి మండలం వెంకటాపూర్ గ్రామ సమీపంలో ఏర్పడిన మిషన్ భగీరథ పీసీసీపీ ప్రధాన పైపు లైన్ లీకేజీ మరమ్మతు కారణంగా మూడు రోజులు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు కార్యనిర్వహక ఇంజనీర్ అధికారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గం పరిధిలో ఉన్న గ్రామాలకు, మున్సిపాలిటీలకు నీరు ఇవ్వడం జరగదన్నారు. కావున ఆయా నియోజకవర్గ ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోని సహకరించాలని కోరారు.
News January 23, 2026
రంజాన్‌ను ప్రశాంతంగా జరుపుకుందాం: కలెక్టర్

జిల్లావ్యాప్తంగా రంజాన్ మాసాన్ని మతసామరస్యంతో, సోదరభావంతో జరుపుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రార్థనా స్థలాల వద్ద విద్యుత్, తాగునీరు, పారిశుధ్య సౌకర్యాల్లో అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


