News February 3, 2025

జగిత్యాలలో వాతావరణం ఎలా ఉందంటే..?

image

జగిత్యాలలో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. సారంగాపూర్‌లో 16.7℃, మన్నెగూడెం 16.9, మల్లాపూర్, కొల్వాయి 17, నేరెల్ల 17.1, కథలాపూర్ 17.2, గోవిందారం, మెట్‌పల్లి, బుద్దేష్‌పల్లి 17.3, గోదురు, మద్దుట్ల 17.4, పెగడపల్లి, రాఘవపేట 17.5, కోరుట్ల, గుల్లకోట 17.6, తిరుమలాపూర్, ఐలాపూర్, జగిత్యాల, మల్యాల 17.7, వెల్గటూర్ 17.8, ఎండపల్లి 17.9, జగ్గసాగర్ 18.1, రాయికల్, జైన 18.2, మేడిపల్లిలో 18.3℃గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News March 13, 2026

చెరువుల పరిరక్షణే లక్ష్యం: HNK కలెక్టర్

image

జిల్లాలోని చెరువులు, కుంటలను కాపాడుకోవడం మనందరి బాధ్యతని HNK కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. జల వనరుల్లో సిల్ట్ పేరుకుపోవడం, కాలుష్య కారకాలు చేరడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. చెరువుల నీటి నాణ్యతను కాపాడుతూ, జీవవైవిధ్యానికి భంగం కలగకుండా పక్కా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

News March 13, 2026

పదో తరగతి పరీక్షలు.. గిరిజన విద్యార్థులు 3,628 మంది

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఐటీడీఏ పరిధిలోని గిరిజన విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమయ్యారని పీవో రాహుల్ తెలిపారు. 92 విద్యాసంస్థల నుంచి 3,628 మంది విద్యార్థులు రేపటి నుంచి పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. 56 ఆశ్రమ పాఠశాలలు, 21 వసతిగృహాలు, 12 గురుకులాలు, 3 బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉన్నారన్నారు. మొత్తం బాలురు 1,689 కాగా, బాలికలు 1,939 మంది హాజరవుతున్నట్లు వివరించారు.

News March 13, 2026

68.56 శాతం పూర్తయిన ఓటర్ల జాబితా మ్యాపింగ్

image

జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 68.56 శాతం మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా మిగిలిన ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.