News March 19, 2024

KTDM: ప్రిన్సిపల్‌ వేధింపులు.. విద్యార్థినుల ఆందోళన..!

image

ప్రిన్సిపల్‌, సహాయకులు విద్యార్థినుల హాస్టల్లోకి వచ్చి అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారంటూ భద్రాద్రి జిల్లా ప్రభుత్వ వైద్యకళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారు మాట్లాడుతూ.. ప్రిన్సిపల్‌ విద్యార్థినులుండే హాస్టల్‌కు రాత్రివేళ సిబ్బందితో వచ్చి క్రమశిక్షణ పేరుతో కఠినంగా వ్యవహరిస్తున్నారు. కొందరితో అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రిన్సిపల్‌ వివరణిస్తూ.. ఎప్పుడూ అసభ్యకరంగా మాట్లాడలేదన్నారు.

Similar News

News February 18, 2026

ఖమ్మం: వాహనాలకు రిఫ్లెక్టివ్ టేపులు తప్పనిసరి

image

ఖమ్మం (D)లో రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖ కఠిన చర్యలు చేపట్టింది. ఇకపై రాత్రి వేళల్లో వాహనాలు స్పష్టంగా కనిపించేలా రిఫ్లెక్టివ్ టేపులు, రియర్ మార్కింగ్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ కొత్త రూల్ తెచ్చింది. క్యూఆర్ కోడ్ లేని వాహనాలకు ఫిట్ నెస్ సర్టిఫికెట్లు జారీ చేయమని RTO జగదీష్ స్పష్టం చేశారు. రాత్రి సమయాల్లో నిలిపి ఉంచిన లారీల వల్ల జరుగుతున్న ప్రమాదాలను అరికట్టడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమన్నారు.

News February 18, 2026

ఖమ్మం: న్యాయవాది నుంచి కౌన్సిలర్‌గా

image

కోర్టులో కేసులు వాదించే స్థాయి నుంచి ప్రజల పక్షాన నిలిచే ప్రజాప్రతినిధిగా అడ్వకేట్ దండి శ్రీజ బాధ్యతలు చేపట్టారు. ఎదులాపురం మున్సిపాలిటీ 30వ వార్డు కౌన్సిలర్‌గా సీపీఐ తరపున విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ఖమ్మం జిల్లాలో న్యాయవాదిగా సేవలందించిన శ్రీజ, ఇప్పుడు ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, మిత్రులు ఆమెను అభినందించారు.

News February 18, 2026

ఖమ్మం: సీతారామ ప్రాజెక్టు కోసం కలెక్టర్ చొరవ!

image

ఖమ్మం (D)లో సీతారామ ఎత్తిపోతల పథకం 13వ ప్యాకేజీ పనులను వేగవంతం చేసేందుకు కలెక్టర్ అనుదీప్ రంగంలోకి దిగారు. బాజుమల్లాయిగూడెం, రేలకాయలపల్లి రైతులతో సమావేశమై భూసేకరణపై చర్చించారు. నిబంధనల మేరకు గరిష్ఠ పరిహారంతో పాటు పంటలు, నిర్మాణాలకు సంబంధించిన నష్టపరిహారాన్ని నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేశామని స్పష్టం చేశారు. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు రైతులందరూ సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.