News February 3, 2025
నేషనల్ లెవెల్‌లో కొత్తగూడెం జిల్లా వాసులు సత్తా

కేరళ కున్నాంకులంలో నిర్వహించిన ఆల్ ఇండియా సీనియర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్స్ షిప్ ఈ పోటీల్లో భద్రాద్రి జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. 200 మీటర్స్‌లో దుమ్ముగూడెం మం. పత్తిపాకకు చెందిన అపకా సతీష్ మొదటి బహుమతి, సింగవరానికి చెందిన కల్లూరి మురళి రెండో బహుమతి కైవసం చేసుకున్నారు. పలువురు వారిని అభినందించారు.
Similar News
News February 28, 2026
కడప: ఇద్దరు MEOలు సస్పెండ్

ముద్దనూరు MEO-1 అన్నయ్య, కొండాపురం MEO-1 ఓబులేశును సస్పెన్షన్ చేస్తూ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముద్దనూరు మండలం చింతకుంట ఎంపీపీ స్కూల్‌లో గతంలో విధులు నిర్వర్తించిన ఓ ఉపాధ్యాయుడు పాఠశాలకు గైర్హాజరైనా కూడా MEOలు జీతాలు మంజూరు చేసినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో MEOలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
News February 28, 2026
జగిత్యాల: ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. నిలువు దోపిడి

జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఒక మహిళకు విజయవాడకు చెందిన వంశీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళను వేములవాడకు రప్పించాడు. ఇద్దరూ కలిసి స్థానిక ప్రైవేట్ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. ఆ మహిళ బాత్రూమ్‌కి వెళ్లిన సమయంలో ఆమె బ్యాగులో ఉన్న 3తులాల బంగారు గొలుసుతో పాటు రూ.10వేలు తీసుకొని పరారయ్యాడు. దీంతో బాధిత మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
News February 28, 2026
అనంత: పోలీస్ వాహనం ధ్వంసం.. నిందితుడి అరెస్ట్

మద్యం మత్తులో భార్యపై దాడి చేయడమే కాకుండా పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం రాణినగర్‌కు చెందిన బళ్లారి బాబా మౌలా మద్యం మత్తులో తన భార్యను కొడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి వెళ్లగా వారిపై తిరగబడి వాహనాన్ని ధ్వంసం చేశాడు, దీంతో అతన్ని అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ (జిల్లా జైలు)కు తరలించారు.


