News February 3, 2025
ధర్మపురి: శ్రీ లక్ష్మీనరసింహుడి ఆదాయం ఎంతంటే..
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వివిధ కార్యక్రమాల ద్వారా అదివారం రూ.2,52,508ల ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,27,092, ప్రసాదాల అమ్మకం- రూ.95,820, అన్నదానం- రూ.29,596లు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ పేర్కొన్నారు.
Similar News
News February 3, 2025
జగిత్యాలలో కిడ్నాప్ కలకలం
జగిత్యాల చింతకుంట వాడలో పట్టపగలు కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ఇంటి బయట ఆడుకుంటున్న పాపను ఓ జంట ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా స్థానికులు వారికి దేహశుద్ధి చేశారు. ఇంటి ముందు ఆడుకుంటున్న పాపకు చాక్లెట్ ఆశచూపి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. పాప వాళ్లను చూసి ఇంట్లోకి వెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తల్లిదండ్రులతో పాటు ఇరుగుపొరుగు వారు వారిని పట్టుకన్నారని స్థానికులు పేర్కొన్నారు.
News February 3, 2025
సంగారెడ్డి: రేపటి పరీక్ష ఈ నెల 10కి వాయిదా
సంగారెడ్డిలోని సైన్స్ మ్యూజియంలో మంగళవారం నిర్వహించనున్న భౌతిక రసాయన శాస్త్ర ప్రతిభ పరీక్ష ఈ నెల 10న నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. మండల స్థాయిలో గెలుపొందిన విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News February 3, 2025
NZB: బీజేపీ జిల్లా అధ్యక్షునిగా కులచారి దినేశ్
బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా కులచారి దినేశ్ రెండోసారి ఎన్నికయ్యారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి డా.కాసం వెంకటేశ్వర్లు ఓ ప్రకటన జారీ చేశారు. ఇటీవల జరిగిన సంస్థాగత ఎన్నికల సందర్భంగా దినేశ్ కులచారి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన రెండోసారి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. తనకు రెండోసారి అవకాశం కల్పించిన రాష్ట్ర నాయకులు కిషన్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.