News February 3, 2025
నెల్లూరులో మునకపాక MBBS విద్యార్థి మృతి

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు ఏపీ జెన్కో పంప్ హౌస్ బ్యాక్ వాటర్ సమీపంలో మునగపాకకు చెందిన MBBS స్టూడెంట్ పెంటకోట షణ్ముఖ్ నాయుడు(18) గల్లంతయ్యాడు. నెల్లూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో MBBS ఫస్ట్ ఇయర్ చదువుతున్న షణ్ముఖ్ ఆదివారం సెలవుకావడంతో స్నేహితులతో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. అతని డెడ్ బాడీని సోమవారం ఉదయం గుర్తించారు. షణ్ముఖ్ మృతితో మునగపాకలో విషాదఛాయలు అలముకున్నాయి.
Similar News
News December 4, 2025
హనీమూన్ వెకేషన్‌లో సమంత-రాజ్!

ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత-రాజ్ పెళ్లి గురించే చర్చ జరుగుతోంది. డిసెంబర్ 1న పెళ్లి చేసుకున్న ఈ జంట మరుసటి రోజే హనీమూన్‌కు గోవా వెళ్లినట్లు తెలుస్తోంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఈ కపుల్ వెళ్తున్న వీడియోలు వైరలయ్యాయి. కాగా 2 ఏళ్లకు పైగా రిలేషన్‌లో ఉన్న ఈ జోడీ కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌లో ‘భూత శుద్ధి వివాహం’ పద్దతిలో ఒక్కటైన సంగతి తెలిసిందే.
News December 4, 2025
NGKL: రోడ్డు ప్రమాదంలో హోటల్ యజమాని మృతి

కల్వకుర్తి పట్టణంలోని ప్రశాంత్ హోటల్ యజమాని అక్కి శ్రీనివాసులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆయన హైదరాబాదులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చారకొండ మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన ఆయన కల్వకుర్తిలో ప్రశాంత్ హోటల్ పేరుతో ఫేమస్ అయ్యాడు.
News December 4, 2025
బెల్లంపల్లి: సర్పంచ్ అభ్యర్థి మౌనికపై దాడి యత్నం

బెల్లంపల్లి మండలం చాకేపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి మౌనికపై దాడికి యత్నం జరిగినట్లు తాళ్లగురజాల ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఎస్టీ మహిళలకు రిజర్వైన ఈ స్థానంలో మౌనిక నామినేషన్ వేయగా, ఆమె తరఫున భాగ్య వార్డు సభ్యురాలిగా నామినేషన్ వేసింది. భాగ్య భర్త కృష్ణకు ఇది ఇష్టం లేక గొడవ పడ్డాడు. తమ మధ్య గొడవకు మౌనికనే కారణమని భావించి, మౌనిక, ఆమె భర్త సురేశ్‌పై దాడికి యత్నించాడు.


