News February 3, 2025

సంగారెడ్డి: ప్రారంభమైన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

image

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రాం సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

Similar News

News January 26, 2026

NTR: ఉత్తమ అధికారిణిగా అషారపున్నీసా బేగం

image

జిల్లాలో విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కంచికచర్ల ప్రొహిబిషన్&ఎక్సైజ్ సీఐ షేక్ అషారపున్నీసా బేగం ‘బెస్ట్ సీఐ’ అవార్డును అందుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రొహిబిషన్&ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ బాబు చేతుల మీదుగా ఆమె ఈ గౌరవాన్ని స్వీకరించారు. ఉన్నతాధికారుల చేతుల మీదుగా అవార్డు అందుకోవడం గర్వంగా ఉందని, ఈ గుర్తింపు మరింత బాధ్యతాయుతంగా పనిచేసేందుకు స్ఫూర్తినిస్తుందని ఆమె అన్నారు.

News January 26, 2026

రాజ్యాంగ విలువలను కాపాడాలి: మన్యం కలెక్టర్

image

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం కలెక్టరేట్‌లో కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ ప్రజలకు నిబద్ధతతో సేవలందించాలని అధికారులను, సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

News January 26, 2026

ఇలా చేస్తే.. జాతరలో తప్పిపోరు!

image

మేడారం మహా జాతరకు సుమారు 3 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇంతటి భారీ జనసమూహంలో పిల్లలు, వృద్ధులు తప్పిపోయే ప్రమాదం లేకపోలేదు. అందుకే ముందస్తు జాగ్రత్తగా వారి చేతిపై లేదా జేబులో ఫోన్ నంబర్, ఊరి పేరు రాసి ఉంచాలి. స్నానాలు చేసినా చెరిగిపోవద్దంటే జాతరకు వెళ్లే ముందురోజే కోన్ (గోరింటాకు)తో రాయండి. పోలీసుల QR రిస్ట్ బ్యాండ్లతో పాటు ఈ చిన్న చిట్కా మీ ఆత్మీయులను క్షేమంగా ఉంచుతుంది. SHARE IT