News February 3, 2025

భువనగిరి: నేడో, రేపో అధ్యక్షుడి పేరు ప్రకటన!

image

బీజేపీ జిల్లా నూతన అధ్యక్షుడి నియామక ప్రక్రియ తుదిదశకు చేరింది. నేడో, రేపో అధ్యక్షుని పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఊట్కూరి అశోక్ గౌడ్, రాజశేఖర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి పేర్లను స్క్రీనింగ్ కమిటీ రాష్ట్ర నాయకత్వానికి పంపింది. ఇందులో ఒకరి పేరు ఖరారు చేసింది. జిల్లా సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర నాయకత్వం.. పదవి బీసీకి కట్టిపెట్టినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Similar News

News March 19, 2026

20వ రోజుకు యుద్ధం.. 2వేలకుపైగా మరణాలు!

image

అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ పోరు ప్రారంభమై నేటికి 20 రోజులు. పశ్చిమాసియాకు పాకిన ఈ యుద్ధంతో చమురు సంక్షోభం నెలకొనగా.. మరణాల సంఖ్య 2000 దాటింది. ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ఇరాన్‌లో ఇప్పటివరకు 1200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల్లో 850 మంది, ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడుల్లో 13 మంది చనిపోగా మరో 13 మంది US సర్వీస్ మెంబర్స్ కూడా మృతిచెందారు.

News March 19, 2026

నూకాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కలెక్టర్ దంపతులు

image

అనకాపల్లి పట్టణం గవరపాలెం నూకాంబిక అమ్మవారి జాతర సందర్భాన్ని పురస్కరించుకుని అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్, అల్లూరి జిల్లా కలెక్టర్‌ దినేశ్ కుమార్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వీరితో పాటు జేసీ సౌర్యమాన్ పటేల్, ఆర్డీవో షేక్ ఆయిషా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు.

News March 19, 2026

CSKకు బిగ్ షాక్.. కీలక బౌలర్ దూరం

image

మరో 9 రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుండగా CSK జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎల్లిస్(AUS) గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. ఈ విషయాన్ని CSK CEO విశ్వనాథన్ తాజాగా ఓ ఈవెంట్‌లో వెల్లడించారు. ఆయన స్థానంలో వేరే బౌలర్ కోసం చూస్తున్నామన్నారు. డెత్ ఓవర్లలో ఎల్లిస్ కీలక బౌలర్ అని, ఆయన దూరమవడం తమకు పెద్ద దెబ్బ అని విశ్వనాథన్ పేర్కొన్నారు.