News March 19, 2024
కొల్లాపూర్: మంచంపైనే పరీక్ష రాసిన విద్యార్థి

కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి సాంబశివుడికి నెల కిందట ప్రమాదంలో కాలు విరిగింది. సోమవారం కుమారుడు తెలుగు పరీక్ష రాసేందుకు తల్లిదండ్రులు బయ్యన్న, సుజాత మరో సహాయకుడితో మంచంతో సహా ఆటోలో కొల్లాపూర్ లోని పరీక్ష కేంద్రానికి తరలించారు. ముందస్తు అనుమతితో సాంబశివుడిని మంచంపైనే కూర్చొని పరీక్ష రాయించినట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు.
Similar News
News April 4, 2025
MBNR: స్థానిక సంస్థల బరిలో పోటీకి యువత సై!

త్వరలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికల బరిలో సత్తా చాటేందుకు యువత సిద్ధం అవుతోంది. ఓ వైపు ప్రభుత్వాలు తమకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని, మరో వైపు తమ సమస్యల పరిష్కారం కోసం తామే ఎన్నికల బరిలో నిలవాలని తలుస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుతో పాటు రాజకీయాల్లో యువతకు పెద్దపీట వేస్తామని చెప్పుకునే అన్ని పార్టీలు ఏ మేరకు వారికి సీట్లు కేటాయిస్తాయో వేచి చూడాలి.
News April 4, 2025
MBNR: ముగ్గురిపై కేసు నమోదు

మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం బిల్డింగ్‌తండా గ్రామంలో గురువారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ పాదయాత్రను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి నిర్వహించారు. ఈ సమయంలో బందోబస్తుకు వచ్చిన ఎస్ఐ లెనిన్‌తో బిల్డింగ్‌తండా గ్రామ పంచాయతీ పరిధిలోని కోయిలకుంట తండాకు చెందిన ముగ్గురు దురుసుగా ప్రవర్తించారు. తమ విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
News April 4, 2025
మహబూబ్‌నగర్: రెడ్ క్రాస్ డయాగ్నొస్టిక్ స్థలానికి గవర్నర్‌కి ఎమ్మెల్యే వినతి

మహబూబ్‌నగర్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డయాగ్నొస్టిక్ సెంటర్‌కు కేటాయించి అధునాతన భవన నిర్మాణానికి చేయూత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఎలాంటి లాభపక్ష లేకుండా ఎన్నో సంవత్సరాలుగా పట్టణ ప్రజలకు ఆపత్కాలంలో సేవలు అందిస్తూ తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తాన్ని సేకరించి ప్రాణం పోస్తున్నామన్నారు.