News February 3, 2025

MBNR: చల్లా వంశీచంద్ రెడ్డికి కీలక పదవి

image

కల్వకుర్తి కాంగ్రెస్ నేత చల్లా వంశీచంద్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం కీలక పదవి కట్టబెట్టింది. ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ ఆఫ్ లీడర్స్ అండ్ ఎక్స్‌పర్ట్స్ అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ kc వేణుగోపాల్ ప్రకటన జారీ చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ కమిటీని 8మంది సభ్యులతో ఏర్పాటు చేయగా తెలంగాణకు చెందిన చల్లా వంశీచంద్ రెడ్డికి చోటు దక్కింది.

Similar News

News September 15, 2025

భార్యాభర్తలు.. ఇద్దరూ కలెక్టర్లే

image

ఏపీ చ‌రిత్ర‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా క‌లెక్ట‌ర్‌గా హిమాన్ష్‌శుక్లా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేపట్ట‌గా ఆయ‌న స‌తీమ‌ణి కృతికాశుక్లా కూడా నిన్నే ప‌ల్నాడు జిల్లా క‌లెక్ట‌ర్‌గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. 2013 బ్యాచ్‌కు చెందిన ఈ భార్యాభ‌ర్త‌లు ఒక‌రు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన వారు కాగా మ‌రొక‌రు హ‌ర్యానాకు చెందిన వారు. ఇద్ద‌రూ కుటుంబంతోపాటు వెళ్లి బాధ్యతలు స్వీకరించారు.

News September 15, 2025

ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తుకు పరిష్కారం చూపాలి: కలెక్టర్

image

సమస్యలు పరిష్కరించాలని ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. నేడు ఐడీవోసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు నుంచి సమస్యల దరఖాస్తులు స్వీకరించారు. ప్రతి దరఖాస్తు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, పరిష్కారంలో జాప్యం చేయొద్దని అధికారులకు తెలిపారు.

News September 15, 2025

రేపు భారీ వర్షాలు

image

ఏపీలోని కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. కాగా ఇవాళ తూ.గో., ప.గో., కాకినాడ, కోనసీమ జిల్లాల్లో వర్షాలు కురిశాయి.