News February 3, 2025
సౌతాఫ్రికాకు నిధుల్ని నిలిపేసిన ట్రంప్
దక్షిణాఫ్రికాకు తమ దేశం ఇచ్చే నిధులన్నింటినీ ఆపేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ‘కొన్ని వర్గాల ప్రజలపై సౌతాఫ్రికా చాలా ఘోరంగా వివక్ష చూపిస్తోంది. వారి భూముల్ని లాక్కుంటోంది. అక్కడి వామపక్ష మీడియా దీన్ని బయటికి రాకుండా అడ్డుకుంటోంది. ఇలాంటివాటిని చూస్తూ ఊరుకోం. అక్కడేం జరుగుతోందో పూర్తి నివేదిక వచ్చే వరకూ ఆ దేశానికి మా నిధుల్ని పూర్తిగా ఆపేస్తున్నా’ అని పేర్కొన్నారు.
Similar News
News February 3, 2025
17% పెరిగిన జీఎస్టీ ఆదాయం
తెలంగాణలో జీఎస్టీ, వ్యాట్ రాబడులు పెరిగాయి. జనవరిలో ఏకంగా 17 శాతం జీఎస్టీ ఆదాయం పెరిగింది. 2024 జనవరిలో రూ.3351.88 కోట్ల జీఎస్టీ వసూలు కాగా, ఈ ఏడాది JANలో రూ.3921.68 కోట్లు వచ్చాయి. గత 10 నెలల్లో జీఎస్టీ, వ్యాట్ కింద రూ.62858.55 కోట్లు వసూలు అయ్యాయి.
News February 3, 2025
APకి రూ.9,417కోట్లు, TGకు రూ.5,337 కోట్లు: అశ్వినీ వైష్ణవ్
రైల్వే బడ్జెట్లో తెలుగు రాష్ట్రాల కేటాయింపులపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. ‘తెలంగాణకు రూ.5,337cr, APకి రికార్డు స్థాయిలో రూ.9,417cr కేటాయించాం. తెలంగాణ వ్యాప్తంగా 1,326KM కవచ్ టెక్నాలజీ పని చేస్తోంది. APకి UPA హయాంలో కంటే 11రెట్లు ఎక్కువ కేటాయించాం. APలో 73రైల్వేస్టేషన్ల అభివృద్ధికి నిధులిచ్చి రూపురేఖలు మారుస్తున్నాం. రూ.8,455cr విలువైన రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేశాం’ అని అన్నారు.
News February 3, 2025
తండ్రిని రెండు ముక్కలు చేయాలనుకున్నారు!
తండ్రికి అంత్యక్రియలు చేసేందుకు ఆ ఇద్దరు కొడుకులు పోటీ పడ్డారు. ఈక్రమంలో మృతదేహాన్ని గంటల తరబడి ఇంటి బయటే వదిలేశారు. చివరికి శవాన్ని 2 ముక్కలు చేసి చెరో ముక్కకు ఇద్దరు అంత్యక్రియలు చేయాలన్న నిర్ణయానికొచ్చారు. ఆ నిర్ణయం విని హడలిపోయిన స్థానికులు పోలీసులకు విషయాన్ని చేరవేశారు. పోలీసులు పెద్ద కొడుక్కి కర్మకాండ బాధ్యతల్ని అప్పగించారు. MPలోని టీకమ్ గఢ్ జిల్లా తాల్ లిధోరా గ్రామంలో ఈ ఘటన జరిగింది.