News February 3, 2025

మాంచెస్టర్ అమ్మాయితో చిట్యాల అబ్బాయి పెళ్లి

image

చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన రాజీవ్ రెడ్డి యూకేలోని మాంచెస్టర్ చెందిన యువతిని వివాహం చేసుకున్నారు. ఆయన మాంచెస్టర్లో హోటల్ మేనేజెమెంట్ కోర్సు పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే పోలీస్ శాఖలో పనిచేస్తున్న లారెన్ ఫిషర్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరూ పెద్దల సమక్షంలో హిందూ సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. పలువురు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Similar News

News February 28, 2026

జగిత్యాల: మండల సర్పంచ్‌లకు సర్టిఫికెట్లు పంపిణీ

image

జగిత్యాల పట్టణంలోని నూకపల్లి నాక్ సెంటర్‌లో ఎండపల్లి, వెల్గటూర్, బుగారం, కొడిమ్యాల మండలాల సర్పంచ్‌లకు నిర్వహించిన ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు జరిగిన ఈ శిక్షణలో గ్రామాభివృద్ధి, పంచాయతీ పరిపాలన, నిధుల వినియోగం, ప్రభుత్వ పథకాల అమలుపై అవగాహన కల్పించారు. శిక్షణ అనంతరం ఆన్లైన్ టెస్ట్‌లు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు అందజేసినట్లు అధికారులు తెలిపారు.

News February 28, 2026

జగిత్యాల: వసతి గృహ సంక్షేమ అధికారుల డైరీ ఆవిష్కరణ

image

జిల్లా వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం డైరీని జగిత్యాల జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కే.రాజ్ కుమార్, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ జి.సునీతతో కలిసి శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌జీవోస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి, ట్రెజరర్ ఎండీ సాజిద్ బాబా, సంక్షేమ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కే.శ్రీనివాస్ నాయక్, సెక్రటరీ వి.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

News February 28, 2026

నల్గొండ: మహిళలకు ఉచిత బ్యూటీషియన్ శిక్షణ

image

జిల్లా మహిళా ప్రాంగణంలో ఉచిత బ్యూటీషియన్ శిక్షణ ప్రారంభం కానున్నట్లు మేనేజర్ అనిత తెలిపారు. 18-35 ఏళ్లలోపు వయస్సు ఉండి, కనీసం 8వ తరగతి చదివిన మహిళలు అర్హులు. ఆసక్తి గలవారు రెండు ఫోటోలు, ఆధార్‌ కార్డుతో కార్యాలయంలో సంప్రదించాలి. ఒంటరి మహిళలు, వికలాంగులకు ప్రాధాన్యత ఉంటుందని ఆమె పేర్కొన్నారు.