News February 3, 2025
HYD: యాక్సిడెంట్.. MLA గన్‌మెన్ మృతి

రోడ్డు ప్రమాదంలో MLA గన్‌మెన్ మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. శంకర్‌పల్లి మండలం బుల్కాపూర్‌కు చెందిన శ్రీనివాస్(34) ఆదివారం బీరప్ప జాతరకెళ్లాడు. జాతర ముగించుకుని స్వగ్రామానికి బయల్దేరాడు. కొండకల్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాస్ చేవెళ్ల MLA కాలే యాదయ్య వద్ద గన్‌మెన్‌గా పని చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 24, 2026
IPLకు ముందు సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన గిల్

IPLకు ముందు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన సక్సెస్ సీక్రెట్‌ను పంచుకున్నారు. తనలోని ప్రశాంతతకు తనపై తనకు ఉన్న నమ్మకం, జట్టు ఇచ్చే భరోసాయే కారణమని తెలిపారు. సోమవారం జరిగిన ‘శుభారంభ్ 2026’ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన.. ప్రశాంతంగా ఉండటం వల్ల పరిస్థితులను స్పష్టంగా అంచనా వేయొచ్చని, అది లాంగ్ టర్మ్ విజన్ ఇస్తుందని చెప్పారు. కోచ్ ఆశిష్ నెహ్రా కూడా తమ లక్ష్యం గెలవడమేనని స్పష్టం చేశారు.
News March 24, 2026
పటాన్‌చెరు: వరకట్న వేధింపులు.. భర్తకు జీవిత ఖైదు

వరకట్న వేధింపులతో భార్య ఆత్మహత్యకు కారణమైన నిందితుడుకి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కృష్ణ అర్జున్ సోమవారం జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. నిందితుడు రాజశేఖర్ రెడ్డి 2016లో వివాహమైన నాటి నుంచి భార్య శ్రీలతను కట్నం కోసం వేధించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె 2020లో సూసైడ్ చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేయగా ఈ కేసులో నేరం రుజువు కావడంతో న్యాయస్థానం ఈ కఠిన శిక్షను ఖరారు చేసింది.
News March 24, 2026
పిట్లం: తగ్గిన పసిడి ధర: పుంజుకున్న పసిడి విక్రయాలు!

గత కొంతకాలంగా ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపించాయి. అయితే, గత రెండు రోజులుగా పసిడి ధరలు భారీగానే తగ్గడంతో మార్కెట్‌లో మళ్లీ గిరాకీ పుంజుకుంది. ప్రస్తుతం అంతర్జాతీయ పరిణామాలు, మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా ధరలు కాస్త దిగిరావడంతో, వినియోగదారుల్లో హుషారు కనిపిస్తోంది. రాబోయే వివాహ ముహూర్తాల కోసం నగలు చేయించుకునేందుకు ప్రజలు మళ్లీ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.


