News February 3, 2025

HYD: యాక్సిడెంట్.. MLA గన్‌మెన్ మృతి

image

రోడ్డు ప్రమాదంలో MLA గన్‌మెన్ మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. శంకర్‌పల్లి మండలం బుల్కాపూర్‌కు చెందిన శ్రీనివాస్(34) ఆదివారం బీరప్ప జాతరకెళ్లాడు. జాతర ముగించుకుని స్వగ్రామానికి బయల్దేరాడు. కొండకల్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాస్ చేవెళ్ల MLA కాలే యాదయ్య వద్ద గన్‌మెన్‌గా పని చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 3, 2025

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌కు కొత్త అధ్యక్షులు

image

తెలంగాణలో 27 జిల్లాల BJP అధ్యక్షులను ప్రకటించారు. హైదరాబాద్ అధ్యక్షుడిగా లంక దీపక్ రెడ్డి,  సికింద్రాబాద్ మహంకాళి-భరత్ గౌడ్, మేడ్చల్ జిల్లాకు బీ.శ్రీనివాస్‌ను నియమించారు.

News February 3, 2025

HYDలో త్రిష ట్రైనింగ్.. ఇదీ ఫలితం!

image

గొంగ‌డి త్రిష‌.. U-19 క్రికెట్‌లో ఈ పేరు ఓ సంచలనం. తన ప్రతిభతో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా నిలిచారు. ఇంతలా పేరు తెచ్చుకున్న ఆమె మన తెలంగాణ బిడ్డ అని గర్వంగా చెప్పుకుంటున్నారు. 2013లో భద్రాచలం నుంచి HYDకి వచ్చిన రామిరెడ్డి 7 ఏళ్ల త్రిషను సికింద్రాబాద్‌లోని సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడ‌మీలో చేర్చారు. రోజుకు 8 గంటలు ప్రాక్టీస్‌ చేసిన త్రిష నేడు తన ప్రదర్శనతో HYDలో బెస్ట్ ట్రైనింగ్ ఉందని నిరూపించారు.

News February 3, 2025

SCRలో ఉద్యోగం.. ఈ రోజే లాస్ట్!

image

SCRలో ఉద్యోగం చేయాలనుకునేవారికి అలర్ట్. స్పోర్ట్స్ కోటా కింద రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. సికింద్రాబాద్‌ హెడ్ క్వార్టర్స్‌‌లో 31, సికింద్రాబాద్ డివిజన్‌లో 5, హైదరాబాద్-5, విజయవాడ-5, గుంటూరు-5 నాందేడ్-5, గుంతకల్‌‌‌లో 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత: 10th, ఇంటర్, ITI ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 25 మధ్య ఉండాలి. అప్లై చేసేందుకు చివరి తేదీ: ఫిబ్రవరి 03, 2025.
SHARE IT