News February 3, 2025

సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే గన్‌మెన్ మృతి

image

రోడ్డు ప్రమాదంలో చేవెళ్ల ఎమ్మెల్యే గన్‌మెన్ మృతి చెందిన ఘటన పటాన్ చెరు మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి(M) బుల్కాపూర్‌కు చెందిన శ్రీనివాస్(34) పటాన్ చెరు(M) ఎలిమెలలో ఆదివారం బీరప్ప జాతరకు అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. జాతర ముగించుకుని వస్తుండగా కొండకల్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News March 20, 2026

ఆదివాసీ గూడాలల్లో తాగునీటి బోర్లు, బావులు : మంత్రి సీతక్క

image

మిషన్ భగీరథ వ్యవస్థ అందుబాటులోకి రాని మారుమూల ఆదివాసీ గూడాలల్లో తక్షణమే మంచినీటి బావులు, బోర్లను నిర్మించాలని మంత్రి సీతక్క అన్నారు. వేసవిలో తాగునీటి సమస్య పరిష్కారంపై సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ దివ్య దేవరాజన్, ఈఎన్సీ కృపాకర్ రెడ్డితో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో కుంటలను తవ్వించి భూగర్భ జలాలను పెంచాలని సూచించారు. పైప్ లైన్లకు వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు.

News March 20, 2026

KMR: నెలవంక దర్శనం.. రేపే ఈద్-ఉల్-ఫితర్

image

ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగకు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక దర్శనమివ్వడంతో శనివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ముస్లింలు రంజాన్ పండుగను జరుపుకోనున్నారు. నెలవంక కనిపించిన వెంటనే ఒకరికొకరు ఈద్ కా చాంద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. కాగా నెల రోజులుగా ముస్లింలు పాటిస్తున్న కఠిన ఉపవాస దీక్షలు నేటితో ముగిశాయి.

News March 20, 2026

సిరిసిల్ల: 4 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది

image

యాసంగి సీజన్‌లో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో యాసంగి సీజన్ కొనుగోళ్లపై అధికారులు,రైస్ మిల్లర్లు,ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సుమారు జిల్లాలో 2,70,000 నుంచి 3 లక్షల మెట్రిక్ నెల ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొత్తం 240 కొనుగోలు కేంద్రాలు ఉంటాయన్నారు.