News February 3, 2025
బెల్లంపల్లి: 4 రోజులుగా అక్కడే పులి నివాసం!

గత 4 రోజులుగా బెంబేలెత్తిస్తున్న పెద్దపులి బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామం బుగ్గగూడెం అటవీ ప్రాంతంలోనే తిష్ట వేసింది. సోమవారం FRO పూర్ణచందర్ మాట్లాడుతూ..బుగ్గగూడెం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరాలో పెద్దపులి కదలికలు రికార్డు అయ్యాయన్నారు. పులి స్థావరం సురక్షితంగా ఉండడంతోనే గత 4 రోజులుగా ఒకే ప్రాంతంలో సంచరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బుగ్గ రహదారిలో ప్రజలెవరు వెళ్లకూడదని హెచ్చరించారు.
Similar News
News November 8, 2025
టీడీపీ కార్యకర్తలకు రూ.135 కోట్లు ఖర్చు చేశాం: లోకేశ్

కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో శుక్రవారం మంత్రి నారా లోకేశ్ సమావేశం నిర్వహించారు. కార్యకర్తలే పార్టీకి అధినేతలన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం ఇప్పటి వరకు రూ.135 కోట్లు ఖర్చు చేశామన్నారు. సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
News November 8, 2025
చరిత్ర సృష్టించిన ఉమెన్స్ వరల్డ్ కప్

ఇటీవల ముగిసిన ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ డిజిటల్ వ్యూయర్‌షిప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లను జియో హాట్‌స్టార్‌లో 446 మిలియన్ల మంది వీక్షించినట్లు సంస్థ ప్రకటించింది. ఉమెన్ క్రికెట్‌లో ఇదే అత్యధికమని, 3 వరల్డ్ కప్‌ల టోటల్ వ్యూయర్‌షిప్ కంటే ఎక్కువని పేర్కొంది. అలాగే భారత్-సౌతాఫ్రికా ఫైనల్‌ను 185 మిలియన్ల మంది చూశారని వివరించింది. ఇది 2024 మెన్స్ T20WC ఫైనల్‌తో సమానమని వెల్లడించింది.
News November 8, 2025
HYD: ఫైర్, హెల్త్ సేఫ్టీ కోర్సుల్లో శిక్షణ

నేషనల్ సెంటర్ ఫర్ ఫైర్, హెల్త్ సేఫ్టీ, ఎన్విరాన్‌మెంట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఆమోదిత ఫైర్, హెల్త్ సేఫ్టీ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రోగ్రామ్ డైరెక్టర్ ఎ.విమలా రెడ్డి తెలిపారు. ఫైర్, ఇండస్ట్రీయల్, హెల్త్ సేఫ్టీ కోర్సుల్లో డిప్లొమా, పీజీ డిప్లొమా, ఎన్విరాన్‌మెంట్ కోర్సులో మాస్టర్ డిప్లొమాలో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.


