News February 3, 2025
ఉప్పరపల్లి: గీత కార్మికుడికి తీవ్రగాయాలు

చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన మండ నరేందర్ గౌడ్ తాటి చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు జారీ కింద పడ్డాడు. తలకు, నడుముకు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
Similar News
News April 25, 2025
WGL: బైకుపై వెళ్తుండగానే గుండెపోటు.. వ్యక్తి మృతి

గుండెపోటుతో వ్యక్తి మరణించిన ఘటన <<16198792>>WGL జిల్లాలో<<>> నిన్న జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. MHBD జిల్లా నెల్లికుదురు మండలం మేజరాజుపల్లికి చెందిన యాకయ్య(45) KNR జిల్లాలోని ఓ క్వారీలో పని చేస్తున్నాడు. బాబాయి బిడ్డ పెళ్లికోసం స్వగ్రామానికి వచ్చి తిరిగి KNR బయల్దేరాడు. పర్వతగిరి మండలానికి చెందిన ఓ వ్యక్తి లిఫ్ట్ అడగ్గా.. అతడినే బైక్ నడపమని వెనక కూర్చున్నాడు. గవిచర్లకు చేరుకోగానే గుండెపోటుతో మరణించాడు.
News April 25, 2025
వరంగల్: షీ టీంపై పాలిటెక్నిక్ విద్యార్థులకు అవగాహన

వరంగల్ షీటీం పోలీసుల ఆధ్వర్యంలో నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు షీ టీం పని తీరుపై ఈరోజు అవగాహన కల్పించారు. షీ టీంను ఎలా సంప్రదించాలి, ఎలా ఫిర్యాదు చేయాలో వారు విద్యార్థినిలకు వివరించారు. అలాగే సైబర్ క్రైమ్, బాల్య వివాహాలు, మహిళా వేధింపులు, 1930 సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్, డయల్ 100 మొదలైన అంశాలను ప్రజలకు వివరించారు. మహిళలు ఎక్కడైనా వేధింపులకు గురైతే షీ టీంకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
News April 25, 2025
ఎనుమాముల మార్కెట్ వ్యాపారులు, రైతులకు ముఖ్య గమనిక

వరంగల్ ఎనుమాముల మార్కెట్ వ్యాపారులకు, రైతులకు అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ వేసవికాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున సరుకుల బీటు సమయాల్లో మార్పులు చేసినట్లు తెలిపారు. మిర్చి బీటు ఉ.7.05 ని.కు, పత్తి బీటు 8:05 ని.కు, పల్లికాయ ఉ.8:15 ని.కు, పసుపు బీటు 8:30కి, అపరాలు, ధాన్యం బీటు 8:45 ని.కు జరుగుతాయని పేర్కొన్నారు. ఈనెల 28 సోమవారం నుంచి 11-06-2025 బుధవారం వరకు ఈ బీటులో మార్పులుంటాయన్నారు.