News February 3, 2025
కొడుకులు తరిమేశారు: వృద్ధ దంపతులు

కన్న కొడుకులు ఆస్తి రాయించుకుని తరిమేశారని డోన్ పట్టణానికి చెందిన వృద్ధ దంపతులు గంగిరెడ్డి, సుబ్బరత్నమ్మ వాపోయారు. తాము కష్టబడి సంపాదించిన ఇల్లు, ఆస్తులన్నింటినీ కుమారులు స్వాధీనం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని, పత్తికొండలోని శారదా వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నామని తెలిపారు. తమకు న్యాయం కావాలని కోరుతూ డోన్ డీఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.
Similar News
News March 22, 2026
ముమ్మిడివరం: చనిపోతానంటూ SMలో సెల్ఫీ వీడియో..!

కాట్రేనికోన పోలీసులు తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ మోకా శ్రీకాంత్ అనే ట్రాక్టర్ డ్రైవర్ పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఇంటి నిర్మాణం కోసం మట్టి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారని, వివక్ష చూపుతూ తనపైనే కేసు నమోదు చేస్తున్నారని సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉండగా, వేధింపుల ఆరోపణలను ఎస్ఐ అవినాష్ తోసిపుచ్చారు.
News March 22, 2026
పాడేరు: స్టీల్ ప్లాంట్‌పై విస్తృత ప్రచారం

అనకాపల్లి జిల్లాలో ఈనెల 23న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. శనివారం పాడేరులో టీడీపీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్రలో 60 వేల మందికి ఉపాధి లభిస్తుందని, ముఖ్యంగా గిరిజన యువతకు ఎంతో మేలు జరుగుతుందని ఆమె వివరించారు.
News March 22, 2026
వారంలో 10% తగ్గిన బంగారం ధర

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. గతవారంలో బంగారం ధర 10% తగ్గింది. 2011 తర్వాత ఇదే అతిపెద్ద క్షీణత. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, డాలర్ బలోపేతం కావడం వల్ల ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. దీంతో శుక్రవారం బంగారం ఔన్సు ధర 4,492 డాలర్లకు చేరింది. వెండి కూడా వారం రోజుల్లో 15% దిగొచ్చింది. దేశీయంగా MCXలో 10 గ్రాముల బంగారం ధర ₹1,44,825కు పడిపోగా కిలో వెండి ₹2,27,470 వద్ద ముగిసింది.


