News February 3, 2025

ముమ్మిడివరం: పోలీసుల వేధింపులతో ఆత్మహత్య?

image

ముమ్మిడివరం: గేదెల్లంకకు చెందిన శివరామకృష్ణ (32) ఆత్మహత్య కలకలం రేపింది. శనివారం పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై ముమ్మిడివరం ఎస్సై జ్వాలాసాగర్ కేసు నమోదుచేశారు. శివరామకృష్ణకు 11 నెలల క్రితం పెళ్లయింది. మృతుడు HYD ఎల్బీనగర్లో ప్రూట్ జ్యూస్ దుకాణం నిర్వహించేవాడు. ఎల్బీనగర్‌లోని ఓ కానిస్టేబుల్ భార్య అదృశ్యంలో ఇతని పాత్ర ఉందని వేధించడమే ఆత్మహత్యకు కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

Similar News

News March 19, 2026

ఏలూరులో ఉగాది వేడుకల్లో కలెక్టర్

image

ఏలూరు గిరిజన భవన్‌లో గురువారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కలెక్టర్ వెట్రి సెల్వి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. సంవత్సరమంతా ప్రజలందరికీ మంచి శుభాలు కలగాలని ఆకాంక్షించారు. నాట్యాచార్య గండికోట రాజేష్ శిష్యబృందం ప్రదర్శించిన నృత్య కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

News March 19, 2026

IPL: సన్‌రైజర్స్ ప్లేయింగ్-11 ఇదేనా?

image

IPL-2026: SRH మార్చి 28న ఆర్సీబీతో తొలి మ్యాచ్ ఆడనుంది. క్రికెట్ విశ్లేషకుల అంచనా ప్రకారం తుది జట్టు..
SRH: హెడ్, అభిషేక్, ఇషాన్ (C), క్లాసెన్ (WK), లివింగ్‌స్టన్, నితీశ్ రెడ్డి, అనికేత్ వర్మ, బ్రైడన్ కార్స్, హర్షల్, ఉనద్కత్, జీషన్ అన్సారీ.
> స్మరణ్, అరోరా, కమిందు మెండిస్, హర్ష్ దూబే, శివంగ్, ఫులేట్రా, ఎడ్వర్డ్స్, ఎషాన్ మలింగ, షకీబ్ హుస్సేన్, ఓంకార్, అమిత్, ప్రఫుల్, మావి అనే ప్లేయర్లూ ఉన్నారు.

News March 19, 2026

సీతారాముల కళ్యాణానికి గవర్నర్‌కు ఆహ్వానం

image

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1న జరగనున్న సీతారాముల కళ్యాణానికి రాష్ట్ర గవర్నర్ S.అబ్దుల్ నజీర్‌ను టీటీడీ AEO వెంకయ్య చౌదరి ఆహ్వానించారు. ఆలయ అర్చకుల మంత్రోచ్ఛారణల నడుమ గవర్నర్‌కు ఆహ్వానం పలికారు. వారి వెంట ఆలయ ఇన్‌ఛార్జ్ DEO శివప్రసాద్, అర్చకులు ఉన్నారు.