News March 19, 2024

BRSకు మల్లారెడ్డి గుడ్ బై?

image

TG: మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలో బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిసి కాంగ్రెస్‌లో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. కాంగ్రెస్‌లో చేరేందుకు కుదరకపోతే బీజేపీలోకి వెళ్లేందుకైనా ఆయన సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News March 13, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 13, 2026

40ల్లో ఈ తప్పులు చేయకండి!

image

రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే 40-50ఏళ్ల మధ్య తీసుకునే ఆర్థిక నిర్ణయాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఆ ఏజ్‌లో జాబ్ మారేటప్పుడు PF విత్‌డ్రా చేయొద్దని, తొందరపడి ఒకటి కంటే ఎక్కువ ప్రాపర్టీలు కొనొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ద్రవ్యోల్బణం ప్రభావం లేని అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని, మల్టిపుల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటున్నారు. ఏటా మీ పోర్ట్‌ఫోలియో చెక్ చేసుకొని సవరించుకోవాలని చెబుతున్నారు.

News March 13, 2026

ఈరోజు నమాజ్ వేళలు (13-3-2026) శుక్రవారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.14 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.22 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.26 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.49 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.26 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.38 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.