News February 3, 2025
తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 తగ్గి రూ.84,050కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.400 తగ్గి రూ.77,050గా నమోదైంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. కేజీ వెండి ధర రూ.1,07,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి.
Similar News
News February 3, 2025
కోర్టును ఆశ్రయించిన ఐశ్వర్యరాయ్ కూతురు
ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య బచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ఆరోగ్యంపై కొన్ని వెబ్‌సైట్లలోని తప్పుడు కథనాలను తొలగించేలా ఆదేశించాలని ఆమె కోర్టును కోరారు. దీనిపై కోర్టు గూగుల్‌కు నోటీసులు జారీ చేసింది. గతంలోనూ ఇదే విషయమై ఆమె కోర్టును ఆశ్రయించగా గూగుల్, యూట్యూబ్‌తో పాటు ఇతర ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
News February 3, 2025
స్వదేశంలో దుమ్మురేపుతోన్న భారత టీమ్
సొంత గడ్డపై మ్యాచ్ అనగానే టీమ్ఇండియా ప్లేయర్లకు పూనకాలొస్తున్నాయి. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో టీమ్ఇండియా 4-1తో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇలా 2019 నుంచి ఇప్పటివరకు టీమ్ఇండియా సొంత గడ్డపై 17 టీ20 సిరీస్‌లు కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా జట్టు వారి సొంత గడ్డపై 2006-10 వరకు ఎనిమిది సార్లు, 2007-2010 వరకు సౌతాఫ్రికా 7 సార్లు, 2008-12 వరకు న్యూజిలాండ్ ఆరు సార్లు తమ గడ్డపై విజయాలు సాధించాయి.
News February 3, 2025
ప్రభుత్వానికి అంబులెన్సులు ఇచ్చిన సోనూసూద్
AP: రాష్ట్ర ప్రభుత్వానికి సినీనటుడు సోనూసూద్ 4 అంబులెన్సులు ఇచ్చారు. ఇవాళ వెలగపూడిలోని సచివాలయానికి వెళ్లిన ఆయన సీఎం చంద్రబాబును కలిసి వాటిని అందజేశారు. సోనూసూద్ ఫౌండేషన్ తరఫున ఇచ్చిన ఆ అంబులెన్సులను ప్రారంభించిన సీఎం ఆయన్ను అభినందించారు. కరోనా సమయం నుంచి అవసరం ఉన్నవారికి సాయం చేస్తూ సోనూసూద్ మంచి మనసు చాటుకుంటున్నారు.