News February 3, 2025

వనపర్తి: సబ్సిడీ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

అర్హులైన దివ్యాంగులకు ఆర్థిక పునరావాస పథకం కింద స్వయం ఉపాధి పొందేందుకు సబ్సిడీ రుణాలకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి సుధారాణి తెలిపారు. 100% రాయితీతో రూ.50,000 చొప్పున 20 యూనిట్లు మంజూరు చేసిన్నారు. మంజూరు నిమిత్తం అర్హులైన దివ్యాంగులను tg obmms.cgg.gov.in వెబ్ సైట్లో ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు పోర్టల్‌ను సంప్రదించాలన్నారు.

Similar News

News February 3, 2025

HYD: మీ పిల్లల్లో ఇలాంటి ప్రవర్తన గుర్తిస్తే జాగ్రత్త..!

image

మత్తుపదార్థాల వినియోగం యువతలో వేగంగా పెరుగుతుండటంతో రాచకొండ సీపీ సుధీర్ బాబు తల్లిదండ్రులకు ముఖ్యమైన హెచ్చరికను జారీ చేశారు. రేవ్‌పార్టీలు, అనుమానాస్పద మాత్రలు, రహస్య ప్రవర్తన వంటి ప్రారంభ లక్షణాలను గమనించడం వల్ల యువతను మత్తుపదార్థాల మాయాజాలం నుంచి కాపాడవచ్చన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడంతో సమస్యను ముందే గుర్తించి నివారించవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

News February 3, 2025

అధికారులకు పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాలు

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇప్పటి వరకూ పెండింగ్‌లో ఉన్న అర్జీలు, రీ ఓపెన్ అర్జీలకు నాణ్యమైన పరిష్కారాలు చూపాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక రీ ఓపెనింగ్ ఫిర్యాదులపై జేసీ సూరజ్, డీఆర్ఓ మురళిలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో40 రీ ఓపెనింగ్ అర్జీలను వ్యక్తిగతంగా పరిశీలించారు. జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News February 3, 2025

ఏటూరునాగారంలో ‘పుష్ప’ నటుడు సందడి

image

ఏటూరునాగారంలో సోమవారం పాన్ ఇండియా పుష్ప సినిమా నటుడు కేశవ (బండారి జగదీశ్ ప్రతాప్) సందడి చేశాడు. తాళ్లగడ్డలోని ఓ బిర్యానీ హోటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన కేశవను చూసేందుకు స్థానిక ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. కేశవతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. నటుడు కేశవ సైతం ‘తగ్గేదేలే’ అంటూ స్థానిక ప్రజలను అలరించాడు.