News February 3, 2025
పెద్దపల్లి: తల్లి గొప్పతనం.. ఇద్దరికి నేత్రదానం..!

ఓదెల గ్రామానికి చెందిన బోడకుంట రాజమ్మ మరణించగా కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు సదాశయ ఫౌండేషన్ ద్వారా నేత్రదానం చేశారు. ఫౌండేషన్ ప్రతినిధి డా.భీష్మాచారి, కొండ్ర వేణు నేత్రదానంపై అవగాహన కల్పించారు. LV ప్రసాద్ ఆసుపత్రి టెక్నీషియన్ నరేందర్ సహకారంతో ఆమె నేత్రాలను సేకరించి HYD-I బ్యాంకుకు తరలించారు. కుటుంబ సభ్యులు లక్ష్మయ్య, సుగుణ, సదానందం, మల్లేశ్వరి, రమేశ్, రమ, మధులను ఫౌండేషన్ ప్రతినిధులు అభినందించారు.
Similar News
News July 5, 2025
డీఎస్సీ నియామక ఉత్తర్వులపై ఆదేశాలు

AP: ఆగస్టు నాటికి డీఎస్సీ నియామక ఉత్తర్వులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని మంత్రి లోకేశ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్య, సమగ్ర శిక్ష, ఉన్నత విద్యాశాఖల ఉన్నతాధికారులతో ఉండవల్లి నివాసంలో ఆయన సమీక్షించారు. డిగ్రీ విద్యార్థులపై భారం తగ్గేలా UGC నిబంధనలకు అనుగుణంగా సబ్జెక్టుల ఎంపిక ఉండేలా చూడాలని సూచించారు. 2024-25కి సంబంధించి ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.
News July 5, 2025
ములుగు: డీసీసీ బ్యాంక్ బ్రాంచి మార్పు

ములుగులోని డీసీసీ బ్యాంకు బ్రాంచి తహశీల్దార్ ఆఫీస్ కార్యాలయం రోడ్ నుంచి కూరగాయల మార్కెట్ రోడ్డుకు మార్చినట్లు బ్యాంకు మేనేజర్ తిరుపతి ప్రకటనలో తెలిపారు. శనివారం నుంచి ములుగు బ్రాంచి సేవలు కూరగాయల మార్కెట్ రోడ్డులోని ఎక్సైజ్ ఆఫీస్ పక్కన ఇంటి నంబరు 6,181లో నిర్వహించడం జరుగుతుందన్నారు. బ్యాంక్ ఖాతాదారులు ఈ విషయాన్ని గమనించాలని మేనేజర్ కోరారు.
News July 5, 2025
తెలంగాణ దేశానికి మోడల్‌గా నిలిచింది: MP కడియం

కాంగ్రెస్ పాలనలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. హైదరాబాదులో నిర్వహించిన సామాజిక న్యాయ సమర భేరి సభలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ ఒక్కటే శ్రీరామ రక్ష అని, రాబోయే అన్ని ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.