News February 3, 2025

ఒమన్ దేశంలో జన్నారం వాసి మృతి

image

జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన దుర్గం మల్లేష్(48) ఓమన్ దేశంలో గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మల్లేష్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మల్లేష్ ఏడాది క్రితం ఒమన్ దేశానికి బతుకుదెరువు కోసం వెళ్లాడు. వచ్చే శనివారం రెండవ కుమార్తె పెళ్లి జరగనుంది. ఇంతలోనే మల్లేష్ మృతితో కవ్వాల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News March 20, 2026

నగరాభివృద్ధికి ప్రత్యేక దృష్టి: కలెక్టర్

image

కర్నూలు నగరాభివృద్ధిని సమగ్రంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తానని కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. శుక్రవారం వెంకటరమణ కాలనీలోని నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఆమె తన ఛాంబర్‌ను ప్రారంభించారు. కమిషనర్ పి.విశ్వనాథ్ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. నగర పరిపాలనలో సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం తన కార్యాలయంలో కేఎంసి పూర్తి మ్యాప్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.

News March 20, 2026

SVU: రేపటి డిగ్రీ పరీక్ష వాయిదా

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ(UG) ఇయర్ ప్యాటర్న్ అభ్యర్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రంజాన్ సందర్భంగా శనివారం జరగాల్సిన పరీక్ష వాయిదా వేసినట్లు పరీక్ష విభాగ నియంత్రణ అధికారి రాజమాణిక్యం పేర్కొన్నారు. వాయిదా పడిన పరీక్ష ఏప్రిల్ 6వ తేదీ జరగనుందన్నారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

News March 20, 2026

నెల్లూరు: గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు

image

నెల్లూరు రూరల్ అక్కచెరువుపాడు మైనార్టీ బాలురు గురుకుల పాఠశాలలో 5, 6, 7, 8వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు మార్చి 31వ తేదీ లోపు https://aprs.apcfss.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థులకు ఏప్రిల్ 24వ తేదీన పరీక్ష నిర్వహిస్తారని చెప్పారు.