News February 3, 2025

ఒమన్ దేశంలో జన్నారం వాసి మృతి

image

జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన దుర్గం మల్లేష్(48) ఓమన్ దేశంలో గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మల్లేష్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మల్లేష్ ఏడాది క్రితం ఒమన్ దేశానికి బతుకుదెరువు కోసం వెళ్లాడు. వచ్చే శనివారం రెండవ కుమార్తె పెళ్లి జరగనుంది. ఇంతలోనే మల్లేష్ మృతితో కవ్వాల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News September 15, 2025

NZB: ప్రజావాణికి 23 ఫిర్యాదులు

image

నిజామాబాద్ సీపీ సాయి చైతన్య తన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 23 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన బాధితులు సీపీ కార్యాలయానికి వచ్చి వినతిపత్రాలు అందజేశారు. ఫిర్యాదుదారుల సమస్యలు విన్న సీపీ వెంటనే సమస్యలు పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలకు ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా తమకు ఫిర్యాదు చేయాలన్నారు.

News September 15, 2025

తిరుపతి: విదేశీ పండ్ల సాగుపై శిక్షణ

image

APSSDC ఆధ్వర్యంలో విదేశీ పండ్ల సాగుపై ఆన్‌లైన్ విధానంలో ఉచిత నైపుణ్య శిక్షణ కల్పిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఆసక్తి కలిగిన యువత, రైతులు QR కోడ్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

News September 15, 2025

‘గ్రామపాలనాధికారులు మెరుగైన సేవలు అందించాలి’

image

ఖమ్మం: గ్రామపాలనాధికారులు నిస్వార్థంగా పనిచేస్తూ ప్రజలకు విశిష్ట సేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్, నూతనంగా నియమించిన గ్రామ పరిపాలన అధికారులకు సోమవారం పోస్టింగ్ ఆర్డర్లను అందజేశారు. జిల్లాలో 299 క్లస్టర్లకు గాను 252 మంది అర్హులైన వారికి మెరిట్ ప్రకారం వారి సొంత మండలం మినహాయించి, ఇతర ప్రదేశాల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు పోస్టింగ్ ఇచ్చామన్నారు.