News February 3, 2025

ఇంగ్లండ్‌పై పంజాబీల ఊచకోత!

image

ఇంగ్లండ్‌పై దండయాత్ర చేసిన భారత యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మపై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పంజాబ్ నుంచి వచ్చిన వారు ఇంగ్లండ్ వారికి చుక్కలు చూపించడం ఇది కొత్తేమీ కాదని పోస్టులు పెడుతున్నారు. దేశానికి ఫ్రీడమ్ తీసుకొచ్చేందుకు ఆంగ్లేయులపై అప్పుడు భగత్ సింగ్, పదేళ్ల క్రితం క్రికెట్‌లో యువరాజ్ సింగ్, ఇప్పుడు అభిషేక్ బ్యాట్‌తో చుక్కలు చూపించారని చేసిన పోస్టర్ వైరలవుతోంది.

Similar News

News March 10, 2026

HEC విద్యార్థులకు ఏయే కోర్సులున్నాయంటే?

image

<<19336321>>ఇంటర్‌లో<<>> HEC పూర్తిచేసిన వారికి విభిన్నమైన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సివిల్స్ ప్రిపేర్ అయ్యేవారు B.Aలో HEP. లిటరేచర్ B.A లాంగ్వేజెస్. జర్నలిస్టు అవ్వాలంటే B.A జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్. న్యాయవాది కావాలనుకుంటే ఐదేళ్ల BA LLB కోర్సు. టీచర్‌ అయ్యేవారికి B.A B.Ed. కంప్యూటర్స్ అంటే మక్కువ ఉంటే BCA కూడా బాగుంటుంది. ఫైన్ ఆర్ట్స్, ఫ్యాషన్ డిజైనింగ్, హోటల్ మేనేజ్మెంట్ వైపు కూడా వెళ్లొచ్చు.

News March 10, 2026

తండ్రిని తలచుకుంటూ రింకూ ఎమోషనల్ పోస్ట్

image

వరల్డ్ కప్ గెలిచిన సంతోషాన్ని పంచుకునేందుకు తన <<19250311>>తండ్రి<<>> పక్కన లేకపోవడంపై టీమ్ఇండియా క్రికెటర్ రింకూ సింగ్ ఎమోషనల్ అయ్యారు. ‘నాన్న మీతో మాట్లాడకుండా ఇన్ని రోజులు ఎప్పుడూ లేను. మీ కల నెరవేరిన తరుణంలో నా పక్కన లేకపోవడం బాధాకరం’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. తన జీవితంలో ప్రతి విజయంలోనూ ఆయన జ్ఞాపకాలు వెన్నంటే ఉంటాయని పేర్కొన్నారు. నాన్నను చాలా మిస్ అవుతున్నానని రింకూ భావోద్వేగానికి లోనయ్యారు.

News March 10, 2026

వేసవిలో వ్యాయామం.. ఏ టైమ్‌లో మంచిది!

image

సమ్మర్‌లో 8am లోపు, 6pm తర్వాత వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘చెట్లు ఎక్కువగా ఉండే పార్కుల్లో అయితే మంచిది. తేలికపాటి, లేతరంగు దుస్తులు, టోపీ ధరించాలి. గంట వ్యాయామం చేసేవాళ్లు 45ని. చేస్తే సరిపోతుంది. డీహైడ్రేషన్‌కు గురికాకుండా మధ్యమధ్యలో తగినన్ని నీళ్లు తాగాలి. అధిక చెమట, బలహీనత, తల తిరగడం, వికారంతోపాటు తలనొప్పి తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే వ్యాయామం నిలిపేయాలి’ అని చెబుతున్నారు.