News February 3, 2025
పెద్దపల్లి బీజేపీ అధ్యక్షుడిగా సంజీవరెడ్డి

ఓదెల మండలం కొలనూర్‌కి చెందిన సంజీవ రెడ్డి బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బీజేపీ తెలంగాణ సంఘటన పర్వ్- 2024 ఎన్నికల నియమావళి ఆధారంగా బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారి క్ష్మీ నారాయణ సంజీవను అధ్యక్షులుగా నియమించారు. ఈ సందర్భంగా బీజేపీ పెద్దపల్లి జిల్లా ఎన్నికల అధికారి శ్రీకాంత్ నియామక పత్రాన్ని విడుదల చేశారు. తన నియామకానికి సహకరించిన వారికి అయన కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News March 13, 2026
VZM: RRB గ్రూప్-D పరీక్షలకు ఫ్రీ కోచింగ్

విజయనగరం జిల్లాలో రైల్వే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి BC సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఫ్రీ కోచింగ్ ఇవ్వనున్నారు. RRB గ్రూప్-D పరీక్షలకు 2 నెలల శిక్షణతో పాటు స్టైఫండ్ ఇస్తారు. టెన్త్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేయనున్నారు. అర్హులు తమ బయోడేటా, టెన్త్ మార్కుల లిస్ట్, క్యాస్ట్, ఇన్‌కమ్, తదితర ధ్రువపత్రాలతో కస్పా హైస్కూల్లో గల BC స్టడీసర్కిల్ కార్యాలయానికి 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
News March 13, 2026
జలుమూరులో అగ్ని ప్రమాదం

జలుమూరు మండలం నామాలపేటలో గురువారం సాయంత్రం జీడీ, నీలగిరి తోటలు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న కోటబొమ్మాళి ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గ్రామ రైతులు ఎన్.భాస్కరరావు, ఎన్.లక్ష్మీనారాయణ, సీహెచ్ రత్నాలు, రమేశ్‌లకు చెందిన నాలుగు ఎకరాలు ఈ ప్రమాదంలో కాలిపోయాయి. సుమారు ఆస్తి నష్టం రూ.50వేల వరకు ఉంటుందని సిబ్బంది అంచనా వేశారు.
News March 13, 2026
HYD: ఫ్యాన్సీ నంబర్లతో భారీగా ఆదాయం

ఖైరతాబాద్ RTA కార్యాలయంలో ఫ్యాన్సీ నంబర్లు దక్కించుకొనేందుకే వాహనదారులు పోటీ పడ్డారు. TG 09 L 0009ను రూ.10,50,000కు, TG 09 L 0007కు రూ.3,19,999, TG 09 L 0005ను రూ.2,00,005కు, TG 09 K 9999ను రూ.1.5 లక్షలకు, TG 09 L 0024ను రూ.1.24 లక్షలకు, TG 09 L 0001ను రూ.లక్షకు దక్కించుకున్నారు. ఈ నంబర్లతో RTA ఆఫీస్‌కు రూ.31,14,730 ఆదాయం వచ్చింది.


