News February 3, 2025
కుంభమేళా భక్తుల భద్రతపై పిల్.. తిరస్కరించిన సుప్రీం
మహా కుంభమేళాకు హాజరయ్యే భక్తుల భద్రత కోసం నిర్దిష్ట మార్గదర్శకాలను కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, అయితే దీనిపై ఇప్పటికే అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైందని UP ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది. మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణించిన సంగతి తెలిసిందే.
Similar News
News February 3, 2025
‘తీన్మార్ మల్లన్న ఏ పార్టీ?’
TG: కాంగ్రెస్ MLC నవీన్ కుమార్(తీన్మార్ మల్లన్న) ఇటీవల చేసిన వ్యాఖ్యలు జనాల్లో గందరగోళానికి తెరలేపాయి. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. దీనిపై పార్టీ ఇప్పటికీ స్పందించకపోవడం ఏంటని జనాలు చర్చించుకుంటున్నారు. అధికారపార్టీ నేతగా ఉండి సొంత పార్టీపైనే విమర్శలు చేయడం ఏంటని విస్తు పోతున్నారు. దీంతో ఆయన ఏ పార్టీ నేత అని పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
News February 3, 2025
రాహుల్ వ్యాఖ్యలు అవాస్తవం: జయశంకర్
లోక్‌సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని విదేశాంగమంత్రి జయశంకర్ ఫైరయ్యారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ప్రధానిని ఆహ్వానించామని కోరడానికి తాను అమెరికాకు వెళ్లాననడం పూర్తిగా అబద్ధం అన్నారు. విదేశాంగ కార్యదర్శిని కలవటానికే అక్కడికి వెళ్లానని స్పష్టం చేశారు. ఎంతో ప్రతిష్ఠ కలిగిన మోదీ లాంటి నాయకుడిపై ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయటం సరికాదని తన X ఖాతాలో పోస్ట్ చేశారు.
News February 3, 2025
తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్
TG: ఎమ్మెల్సీ నవీన్ కుమార్(<<15344708>>తీన్మార్ మల్లన్న<<>>)పై భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఫైరయ్యారు. మల్లన్న స్థాయి మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డబ్బులు ఖర్చు పెట్టి నల్గొండలో ఆయనను గెలిపించినట్లు తెలిపారు. ఓ వర్గాన్ని టార్గెట్ చేసి ఆయన మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పార్టీ ఆయనపై చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.