News February 3, 2025

విశాఖలో ఎలక్ట్రీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ

image

విశాఖలో న్యాక్ ద్వారా నిరుద్యోగులకు ఎలక్ట్రీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. 10వ తరగతి పూర్తి చేసి 15-45 సం.లోపు వారికి 3 నెలల శిక్షణ ఇస్తారన్నారు. శిక్షణ అనంతరం ప్రైవేట్ సెక్టారులో ఉపాధి కల్పిస్తారని చెప్పారు. మహారాణిపేట న్యాక్ శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్ అందిస్తామని వెల్లడించారు. మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

Similar News

News March 1, 2026

విశాఖలో పెరుగుతున్న డ్రగ్స్ కేసులు.. యువతే లక్ష్యం

image

నగరంలో డ్రగ్స్ కేసులు పెరుగుతున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, గోవా నుంచి డ్రగ్స్, ఎండీఎంఏ, హ్యాష్ ఆయిల్ తెచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జనవరి 22న పెందుర్తిలో 4 గ్రా. ఎండీఎంఏ స్వాధీనం కాగా, రెండు రోజుల క్రితం ఎంవీపీ పోలీసులు 2.23 గ్రా. యువకుడిని అరెస్ట్ చేశారు. గతేడాది నగర పరిధిలో గంజాయి, హ్యాష్ ఆయిల్ తదితరవి పట్టుబడగా వాటి విలువ రూ.5 కోట్లగా ఉంది. 500 పైగా కేసులు నమోదు అయ్యాయి.

News March 1, 2026

విశాఖలో కాయగూరల ధరలు ఇలా(కేజీల్లో)..

image

విశాఖలోని 15 రైతు బజార్లో కాయగూరలు ధరలు ఆదివారం ఇలా ఉన్నాయి. పూస వంకాయలు రూ.16, టమాటా రూ.10, కాకరకాయలు రూ.34, బెండకాయలు రూ.42, పచ్చిమిర్చి రూ.54, బీరకాయలు రూ.30, క్యాబేజీ రూ.14, క్యారెట్ రూ.22, దొండకాయలు రూ. 28, ఉల్లిపాయలు రూ.18, గోరుచిక్కుడు రూ.28, దోసకాయలు రూ.24, మునక్కాడ రూ.74, అల్లం రూ.66, చిక్కుడుకాయలు రూ.26, నిమ్మకాయలు రూ.65లకు విక్రయించాలని మార్కెటింగ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

News February 28, 2026

విశాఖ మీదుగా రెండు కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు

image

ప్రయాణికుల సౌకర్యార్థం ఈస్ట్ కోస్ట్ రైల్వే రెండు కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టింది. విశాఖపట్నం-కొల్లాం (18501) మంగళవారాల్లో, చర్లపల్లి-షాలిమార్ అమృత్ భారత్ (17065) మంగళవారాల్లో నడుస్తాయి. ఇవి విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ మీదుగా ప్రయాణిస్తాయి. త్వరలోనే వీటి ప్రారంభ తేదీలను వెల్లడిస్తామని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్ కుమార్ తెలిపారు.