News February 3, 2025
విభజన అంశాలపై హోంశాఖ సమావేశం

ఉమ్మడి ఏపీ విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది. ఏపీ, తెలంగాణ సీఎస్‌లు, ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా పరిష్కారం కాని అంశాలపై చర్చిస్తున్నారు. ఈ చట్టం ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైనా సమాలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Similar News
News March 28, 2026
వికారాబాద్: టెన్త్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

వికారాబాద్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ దీపక్ తివారీ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించిన అనంతరం, చీఫ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో డ్యూటీ రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. నిబంధనల ప్రకారం పరీక్షలు పారదర్శకంగా జరగాలని అధికారులకు సూచించారు.
News March 28, 2026
గంభీర్ ఫొటోలు వాడొద్దు: హైకోర్టు

టీమ్‌ఇండియా కోచ్ గంభీర్ వ్యక్తిత్వ హక్కులను పరిరక్షిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఫొటో, వాయిస్‌తో రూపొందించిన ఏఐ వీడియోలు, డీప్ ఫేక్ కంటెంట్‌ను 36 గంటల్లోగా తొలగించాలని ఇన్‌స్టా, గూగుల్ సహా ఇతర SM ప్లాట్‌ఫామ్స్‌ను ఆదేశించింది. ఈ కంటెంట్‌ను క్రియేట్ చేసిన వారి వివరాలు ఇవ్వాలని పేర్కొంది. అనుమతి లేకుండా వీడియోలు చేయడం వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.
News March 28, 2026
TN ఎన్నికల బరిలో నటుడు సుందర్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డైరెక్టర్, నటుడు సుందర్ తొలిసారి పోటీ చేయనున్నారు. అన్నాడీఎంకే కూటమిలోని పుతియ నీతి కట్చి(న్యూ జస్టిస్ పార్టీ) అభ్యర్థిగా మధురై సెంట్రల్ నుంచి బరిలో దిగనున్నారు. తన భర్తకు సపోర్ట్ చేయాలని బీజేపీ నేత, నటి ఖుష్బూ అభిమానులు, స్నేహితులను కోరారు. 30 ఏళ్లుగా ఆదరిస్తున్న ప్రజలకు సేవ చేయడమే సుందర్ లక్ష్యమని తెలిపారు.
<<-se>>#ELECTIONS2026<<>>


