News February 3, 2025

ఇండస్ట్రీ రికార్డ్ నెలకొల్పిన ‘సంక్రాంతికి వస్తున్నాం’

image

విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రానికి రూ.303 కోట్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. రీజనల్ ఫిల్మ్ కేటగిరీలో ఈ చిత్రం ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిందని పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా భీమ్స్ మ్యూజిక్ అందించారు. కాగా, త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.

Similar News

News March 22, 2026

సమ్మర్‌లో చికెన్ తింటున్నారా?

image

సమ్మర్‌లో మితంగా చికెన్ తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘ఇది అధిక ప్రొటీన్ కలిగి ఉండటం వల్ల జీర్ణక్రియకు ఎక్కువ శక్తి అవసరమై శరీర వేడిని పెంచుతుంది. దీంతో తలనొప్పి, కళ్ల మంటలు, కండరాల నొప్పులు, విపరీతంగా చెమటలు పట్టడం, డీహైడ్రేషన్, అజీర్తి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే చికెన్‌ను వారానికి ఒకసారి తింటే ఓకే కానీ రెండుమూడు సార్లు తీసుకుంటే బరువు పెరుగుతారు’ అని హెచ్చరిస్తున్నారు.

News March 22, 2026

కాబోయే తండ్రుల్లోనూ ‘ప్రెగ్నెన్సీ’ లక్షణాలు

image

గర్భిణుల్లో వాంతులు, అలసట, మూడ్ స్వింగ్స్, నిద్రలేమి, బరువు పెరగటం సహజం. కానీ భార్య గర్భవతిగా ఉన్నప్పుడు కొందరు భర్తల్లోనూ ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్నే Couvade సిండ్రోమ్ అంటారు. భాగస్వామితో బలమైన భావోద్వేగ అనుబంధం వల్ల ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 20% మందిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటున్నారు. కొందరు పురుషుల్లో హార్మోన్ల మార్పులూ జరుగుతాయని పేర్కొంటున్నారు.

News March 22, 2026

ఈ జిల్లాల్లో వర్షాలు!

image

తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, నల్గొండ, ములుగు జిల్లాల్లో ఇవాళ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. Hydలో కూడా స్వల్పంగా వర్షం పడొచ్చని, ఎక్కువగా పొడి వాతావరణమే ఉంటుందని చెప్పింది. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వివరించింది.