News February 3, 2025
జగిత్యాల బీజేపీ అధ్యక్షుడిగా యాదగిరి బాబు

జగిత్యాల జిల్లా BJP అధ్యక్షుడిగా మెట్‌పల్లికి చెందిన పార్టీ సీనియర్ నేత రాచకొండ యాదగిరి బాబును నియమిస్తూ పార్టీ అధిష్ఠానం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించడం సంతోషకరమని.. జిల్లాలో పార్టీ బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. ఇంతకముందు బాబు జిల్లా ప్రధాన కార్యదర్శితోపాటు పార్టీ వేసిన పలు కీలక కమిటీలకు ఛైర్మన్‌గా ఉన్నారు.
Similar News
News March 13, 2026
గ్యాస్ కొరతపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దు: మంత్రి

గ్యాస్ కొరతపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బాట్లింగ్ ప్లాంట్లలో గ్యాస్ కొరత లేదని స్పష్టం చేశారు. అపోహలను సృష్టించి బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పీలతో సమీక్ష నిర్వహించారు. ములుగు కలెక్టర్ దివాకర టి.ఎస్ పాల్గొన్నారు.
News March 13, 2026
గద్వాల: 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతోంది. గురువారం అలంపూర్‌లో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు రోజులు ఎండలు ఇలాగే కొనసాగుతాయని, అయితే మార్చి 16 నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
News March 13, 2026
పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు జమ

AP: PM కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. కృష్ణా(D) గన్నవరంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.6వేలు చొప్పున జమ చేశారు. PM కిసాన్ కింద రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ మూడో విడత కింద రూ.4వేలు.. మొత్తంగా రూ.6వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ పెట్టుబడి సాయంతో రాష్ట్ర వ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతులకు లబ్ధి కలగనుంది.


