News February 3, 2025

పెద్దపల్లి: MLC కవితకు ఘన స్వాగతం..

image

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమాలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చిన సందర్భంగా పెద్దపల్లి మండలంలోని పెద్దకాల్వల వద్ద BRS శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా నాయకులు కవితకు పుష్పగుచ్ఛం ఇవ్వగా.. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి బీఅర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Similar News

News March 31, 2026

సిద్దిపేట: బెంగుళూరులో ఆత్మహత్య చేసుకున్నది వీరే

image

బెంగుళూరులో సహజీవనం చేస్తున్న బాబు రెడ్డి, యువతి <<19524633>>ఆత్మహత్య<<>> చేసుకున్నారు. ఇద్దరూ ఒకరి వెంట ఒకరు సూసైడ్ చేసుకోవడంతో విషాదం నెలకొంది. వారు సహజీవనం చేస్తున్న విషయం ఇంట్లో వారికి తెలియదని పోలీసులు చెప్పారు. బాబు రెడ్డి వద్ద సూసైడ్ నోట్ లభించిందని, మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నట్లు అందులో రాసినట్లు తెలిపారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

News March 31, 2026

పోలీసుల సేవలు అనన్యం: సీపీ

image

సమాజ శ్రేయస్సు కోసం కుటుంబాలను వదిలి నిరంతరం శ్రమించే పోలీసులు అభినందనీయులని రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా కొనియాడారు. మంగళవారం పదవీ విరమణ చేసిన ఎస్సై అంజయ్య, ఏఎస్‌ఐలు వెంకటస్వామి, రాయిస్‌ అహ్మద్‌లను ఆయన ఘనంగా సత్కరించారు. విధి నిర్వహణలో వారు చూపిన అంకితభావం స్ఫూర్తిదాయకమన్నారు. జ్ఞాపికలు అందజేసి, శేష జీవితం సుఖసంతోషాలతో గడవాలని ఆకాంక్షించారు.

News March 31, 2026

విశాఖలో కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై కేసులు

image

విశాఖలో 10 రోజులుగా రవాణా శాఖ అధికారులు కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై 16 కేసులు నమోదు చేసినట్టు ఉప రవాణా కమిషనర్ ఆర్‌సీహెచ్.శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అనుమతులు లేకుండా నడపడం, పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించడం, పన్నులు చెల్లించకపోవడం వంటివి డ్రైవ్‌లో గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన 16 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.6,94,000 ఫైన్ విధించారు.