News February 3, 2025
మేడారంలో బోల్తాపడ్డ వాటర్ ట్యాంక్

తాడ్వాయి మండలం మేడారంలో వాటర్ ట్యాంకర్ బోల్తా పడింది. గ్రామ పంచాయతీకి చెందిన వాటర్ ట్యాంకర్ ట్రాక్టర్ మొక్కలకు నీరు పోసేందుకు తీసుకు వెళ్తుండగా తాడ్వాయి – మేడారంలోని మూలమలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గ్రామ పంచాయతీ సిబ్బంది గజ్జల ఆశయ్య అనే వ్యక్తికి గాయాలైనట్లు సమాచారం.
Similar News
News January 15, 2026
సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటారంటే?

సంక్రాంతి రైతుల పండుగ. ఈ పండుగ నాటికి అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం ఇంటికి చేరుతుంది. ఆ సంతోషంలోనే ఈ పండుగ జరుపుకుంటారు. తమకు సహాయం చేసిన పశువులను పూజిస్తారు. కూలీలకు పండిన ధాన్యంలో కొంత ఇస్తారు. గంగిరెద్దులు, హరిదాసులు, జంగాలు అందరూ సంక్రాంతికే కనిపిస్తారు. వారందరికీ ప్రజలు సంతోషంగా దానధర్మాలు చేస్తారు. ప్రజలు ఒకరితో మరొకరు కృతజ్ఞతతో మెలగాలని చాటి చెప్పడమే ఈ పండుగ ఉద్దేశం.
News January 15, 2026
సంక్రాంతి రోజు ఇలా చేస్తే మంచిది!

పండగ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానం చేయాలని పండితుల మాట. ‘కొత్త దుస్తులు ధరించి సూర్యుడిని స్మరించుకోవాలి. పితృదేవతలను ఉద్దేశించి దానాలు చేయాలి. ఇష్టదైవానికి పూజ చేసి నైవేద్యం పెట్టిన తర్వాత పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి. ఉదయం సత్యనారాయణ స్వామి, సూర్యనారాయణుడి వ్రతాలు చేస్తే పుణ్యఫలం దక్కి కోర్కెలు నెరవేరుతాయి. ముఖ్యంగా శక్తిమేర దానం చేస్తే అనేక రెట్ల ఫలితం వస్తుంది’ అని చెబుతున్నారు.
News January 15, 2026
కామారెడ్డి: గాలిపటాల జోష్.. రోడ్లపై డెత్ రేస్!

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఆకాశం రంగురంగుల గాలిపటాలతో నిండిపోతుంది. అయితే, ఈ సరదా కాస్తా ఒక్కోసారి పెను ప్రమాదాలకు దారితీస్తోంది. గాలిపటం తెగిపోగానే దానిని పట్టుకోవాలనే తాపత్రయంతో చిన్నారులు ప్రాణాలకు తెగించి రోడ్ల వెంట పరుగు పెడుతున్నారు. పండుగ పూట విషాదాలు చోటు చేసుకోకుండా ఉండాలంటే పేరెంట్స్ పిల్లలపై ప్రత్యేక నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉమ్మడి నిజామాబాద్ వాసులు మీ పిల్లలు జాగ్రత్త.


