News February 3, 2025
కోరుట్ల: ధర్మశాల భూమి పూజలో ఎమ్మెల్యే
కోరుట్ల పట్టణంలోని శ్రీ మహాదేవ స్వామివారి ఆలయంలో నూతనంగా నిర్మించబోయే శ్రీ నందీశ్వర ధర్మశాల (కల్యాణ మండపం) భూమిపూజ కార్యక్రమంలో సోమవారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఆయన వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.
Similar News
News February 3, 2025
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు సిద్ధం: సోనూసూద్
సామాన్యుల కోసం తన ఫౌండేషన్ పని చేస్తుందని, AP బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు తాను సిద్ధమని సోనూసూద్ చెప్పారు. ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్ కోసం అంబులెన్సులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అటు, సోనూసూద్‌ను కలవడం సంతోషంగా ఉందని, ఆయన తన ఫౌండేషన్ ద్వారా 4 అంబులెన్సులు ఇవ్వడం పట్ల సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. దీంతో మారుమూల గ్రామాల్లో అందిస్తున్న వైద్య సేవలకు బలం చేకూర్చినట్లు అయిందన్నారు.
News February 3, 2025
మేడ్చల్: పథకాల్లో 60% నిధులు కేంద్రానివే: MP
రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం 60% నిధులు కేటాయిస్తే, రాష్ట్ర ప్రభుత్వ 40% నిధులు కేటాయిస్తుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కోట్లాది రూపాయలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం కోసం ఖర్చు పెట్టిందని, ఇప్పటికీ ఖర్చు పెడుతూ ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ఇతర నేతలు దీన్ని అర్థం చేసుకోవాలన్నారు.
News February 3, 2025
కుప్పంలో పట్టపగలు వరుస చోరీలు
కుప్పం పట్టణంలో మధ్యాహ్నం రెండిళ్లలో వరుస చోరీలు జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బైకుపై వచ్చిన ఓ వ్యక్తి రెండిళ్లలో చోరీలకు పాల్పడినట్లు తెలుస్తోంది. టీబీ రోడ్డు సమీపంలోని ఓ వైసీపీ నేత ఇంట్లో బీరువాను పగలగొట్టి చోరీ చేయడంతో పాటు సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్‌ను దొంగ ఎత్తుకెళ్లాడు. అదేవిధంగా ప్యాలెస్ ఏరియాలో సైతం ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు.