News February 3, 2025
హైదరాబాద్, సికింద్రాబాద్‌కు కొత్త అధ్యక్షులు
తెలంగాణలో 27 జిల్లాల BJP అధ్యక్షులను ప్రకటించారు. హైదరాబాద్ అధ్యక్షుడిగా లంక దీపక్ రెడ్డి, సికింద్రాబాద్ మహంకాళి-భరత్ గౌడ్, మేడ్చల్ జిల్లాకు బీ.శ్రీనివాస్‌ను నియమించారు.
Similar News
News February 3, 2025
రాచకొండ పోలీసులు అద్భుత ప్రతిభ.. సీపీ అభినందన
కరీంనగర్‌లో జరిగిన తెలంగాణ పోలీస్ 3వ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025లో రాచకొండ కమిషనరేట్ తరపున పాల్గొని పలు విభాగాల్లో బహుమతులు గెలుచుకున్న రాచకొండ అధికారులు, సిబ్బందికి ఈ రోజు నేరేడ్మెట్‌లోని రాచకొండ సీపీ కార్యాలయంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రీడల్లో మొత్తం 56 వ్యక్తిగత పతకాలతో పాటు ఉమెన్స్ కబడ్డీలో బంగారు పతకం, మెన్స్ కబడ్డీలో రాచకొండ పోలీసులు రజత పతకం సాధించారు.
News February 3, 2025
HYD: రాచకొండ సీపీ సుధీర్ బాబు సమీక్షా సమావేశం
రాచకొండ కమిషనరేట్ ఐటీ సెల్ విభాగ అధికారులు, సిబ్బందితో ఈరోజు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఐటీ సెల్ సోషల్ మీడియా, సీసీటీఎన్ఎస్, కోర్ టీమ్, సీఈఈఆర్, ప్రజావాణి ఫిర్యాదుల వంటి పలు విభాగాల పనితీరును, ఫలితాల ప్రగతిని కూలంకషంగా పరిశీలించారు.
News February 3, 2025
HYD: మీ పిల్లల్లో ఇలాంటి ప్రవర్తన గుర్తిస్తే జాగ్రత్త..!
మత్తుపదార్థాల వినియోగం యువతలో వేగంగా పెరుగుతుండటంతో రాచకొండ సీపీ సుధీర్ బాబు తల్లిదండ్రులకు ముఖ్యమైన హెచ్చరికను జారీ చేశారు. రేవ్‌పార్టీలు, అనుమానాస్పద మాత్రలు, రహస్య ప్రవర్తన వంటి ప్రారంభ లక్షణాలను గమనించడం వల్ల యువతను మత్తుపదార్థాల మాయాజాలం నుంచి కాపాడవచ్చన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడంతో సమస్యను ముందే గుర్తించి నివారించవచ్చని అధికారులు సూచిస్తున్నారు.