News February 3, 2025

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై ఉత్కంఠ

image

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే ఈటల రాజేందర్, అర్వింద్, రామచంద్రరావు రేసులో ఉండగా, కొత్తగా తెరపైకి మురళీధర్‌రావు, డీకే అరుణ పేర్లు వచ్చాయి. దీంతో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. OCలకు దక్కితే బీసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్, బీసీలకే అధ్యక్ష పదవి దక్కితే వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తావన లేకుండా ప్రకటించాలని భావిస్తోంది.

Similar News

News February 3, 2025

బీసీల పొట్ట కొట్టడానికే తప్పుడు లెక్కలు: ఆర్. కృష్ణయ్య

image

TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కులగణన లెక్కలు తప్పు అని MP ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. ‘KCR చేసిన సర్వేలో 52% BCలు ఉన్నారు. మురళీధర్, మండల్ కమిషన్ రిపోర్ట్ ప్రకారమూ అంతే శాతం ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతమే బీసీలు ఉన్నట్లు చూపిస్తోంది. BCల పొట్ట కొట్టడానికే తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. EWS రిజర్వేషన్లు కాపాడేందుకు BCలకు అన్యాయం చేస్తున్నారు. ఈ లెక్కలను మళ్లీ రివ్యూ చేయాలి’ అని కోరారు.

News February 3, 2025

ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు సిద్ధం: సోనూసూద్

image

సామాన్యుల కోసం తన ఫౌండేషన్ పని చేస్తుందని, AP బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు తాను సిద్ధమని సోనూసూద్ చెప్పారు. ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్ కోసం అంబులెన్సులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అటు, సోనూసూద్‌ను కలవడం సంతోషంగా ఉందని, ఆయన తన ఫౌండేషన్ ద్వారా 4 అంబులెన్సులు ఇవ్వడం పట్ల సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. దీంతో మారుమూల గ్రామాల్లో అందిస్తున్న వైద్య సేవలకు బలం చేకూర్చినట్లు అయిందన్నారు.

News February 3, 2025

రేపు ఢిల్లీకి మంత్రి నారా లోకేశ్

image

AP: మంత్రి నారా లోకేశ్ రేపు సా.4.30 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సా.5.45 గంటలకు భేటీ కానున్నారు. రాష్ట్రానికి రైల్వే బడ్జెట్‌లో కేటాయింపులపై ధన్యవాదాలు తెలపడంతో పాటు పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. రాత్రి 9 గంటలకు తిరిగి లోకేశ్ విజయవాడ బయల్దేరనున్నారు. రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి రూ.9,417 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.