News February 3, 2025

NRPT: పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాలి

image

నులి పురుగులు నివారణకు పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో ఈనెల 10న జరిగే జాతీయ నులి పురుగుల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఒక సంవత్సరం వయస్సు నుంచి 19 ఏళ్ల లోపు పిల్లల్లో నులి పురుగుల నివారణకు మాత్రలు పంపిణీ చేయాలన్నారు.

Similar News

News July 6, 2025

గుమ్మడిదల: ఇన్స్‌పైర్ అవార్డ్స్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల నుంచి ఇన్స్‌పైర్ అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సైన్స్ అధికారి సిద్దారెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 15లోగా https://www. inspireawards-dst.gov.in వెబ్ సైట్లో అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

News July 6, 2025

కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోండి: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో పీజీఆర్ఎస్ ద్వారా అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తారన్నారు. ఉదయం 10 గంటల నుంచి 1.30 వరకు పీజీఆర్ఎస్ జరుగుతుందన్నారు. అలాగే మీకోసం కాల్ సెంటర్ 1100 నంబర్‌కు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News July 6, 2025

శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

image

AP: శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల, సుంకేశుల నుంచి 1.86 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం 67వేల క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు నుంచి 10వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గానూ ప్రస్తుతం 879.30 అడుగులకు నీరు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలకు ప్రస్తుతం 180.42 TMCలుగా ఉంది. 2 రోజుల్లో గేట్లు ఎత్తే ఛాన్స్ ఉంది.