News February 3, 2025
EAPCET షెడ్యూల్ ఖరారు

తెలంగాణ EAPCET షెడ్యూల్ ఖరారైంది. మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష, ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షలు నిర్వహించనుంది. ఈ నెల 20న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈసారి EAPCETను JNTUH నిర్వహిస్తోంది.
Similar News
News March 19, 2026
అరుదైన బ్లడ్ గ్రూప్.. 50 మందికి మాత్రమే!

మనందరిలో ప్రధానంగా నాలుగు గ్రూపుల రక్తం ఉంటుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా 50 మందికి మాత్రమే ఉండే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ ‘Rh-Null’ అనే విషయం మీకు తెలుసా? దీనినే ‘గోల్డెన్ బ్లడ్’ అని పిలుస్తారు. ఇందులో ఏ రకమైన యాంటిజెన్లు ఉండవు, అందుకే ఈ రక్తం ఎవరికైనా సెట్ అవుతుంది. కానీ వీరికి రక్తం కావాలంటే మాత్రం దొరకడం చాలా కష్టం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో
News March 19, 2026
జ్యోతిషుడు అరెస్టు.. మహిళలతో 58 అసభ్యకర వీడియోలు

మహారాష్ట్రలో ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ లాంటి ఘటన సంచలనం రేపుతోంది. నాసిక్‌కు చెందిన జ్యోతిషుడు అశోక్ కారత్ తన వద్దకు వచ్చే మహిళలకు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి చేసేవాడని పోలీసులు గుర్తించారు. వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తూ దోపిడీ చేసేవాడన్నారు. అతడిని అరెస్టు చేసి 58 అసభ్యకర వీడియోలను సీజ్ చేశారు. అశోక్ గతంలో నేవీలో పని చేశాడు. ఇతడికి MH రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలతో సంబంధాలున్నాయి.
News March 19, 2026
సరఫరా కాదు డిస్ట్రిబ్యూషన్‌లోనే సమస్య: కేంద్రం

దేశంలో LPG సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదని.. డిస్ట్రిబ్యూషన్‌లోనే సమస్య ఉందని కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే క్షేత్రస్థాయిలో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని పేర్కొంది. దీనిపై డిస్ట్రిక్ట్ లెవల్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే రాష్ట్రాలకు అప్పీల్ చేశామని తెలిపింది. నిన్న టోటల్ బుకింగ్స్ 56లక్షలుగా ఉండగా సప్లై సంఖ్య 54,91,000గా ఉన్నట్లు తెలిపింది.


