News February 3, 2025
సిద్దిపేట: స్పోర్ట్స్ మీట్‌లో సత్తా చాటిన కమిషనరేట్ సిబ్బంది

రాష్ట్రస్థాయి కరాటేలో గోల్డ్ మెడల్, పవర్ లిఫ్టింగ్‌లో సిల్వర్, బాడీ బిల్డింగ్‌లో సిల్వర్, టెన్నిస్‌లో కాంస్య పతకాలు సాధించిన సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారులు, సిబ్బందిని సీపీ అనురాధ అభినందించారు. కరీంనగర్‌లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌లో రాజన్న సిరిసిల్ల జోన్ తరుపున సిద్దిపేట కమిషనరేట్ సిబ్బంది, అధికారులు సత్తా చాటారు.
Similar News
News March 27, 2026
HYD: త్వరలో తీన్మార్ మల్లన్న పాదయాత్ర

అసెంబ్లీ చీట్ చాట్‌లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్రవర్ణాలతో కలిసేది లేదని, బీసీల హక్కుల కోసం బరిలోకి దిగుతామన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జూన్ 2 నుంచి పాదయాత్ర చేపడతామని, హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలో కొనసాగి… చివరలో వరంగల్‌లో భారీ బహిరంగ సభతో ముగుస్తుందన్నారు.
News March 27, 2026
విజయవాడ, అనంతపురంలో తలసీమియా సెంటర్లు: నారా భువనేశ్వరి

NTR ట్రస్ట్ ఆధ్వర్యంలో త్వరలో విజయవాడ, అనంతపురంలో తలసీమియా సెంటర్లను ఏర్పాటు చేయునట్లు NTR ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతిలో బ్లడ్ బ్యాంక్స్ నిర్వహిస్తుండగా త్వరలో విజయవాడలోనూ ప్రారంభించడం జరుగుతుందన్నారు. మే 10న తలసీమియా బాధితుల కోసం హైదరాబాదులో రన్ నిర్వహించడం జరుగుతుందన్నారు.
News March 27, 2026
జగిత్యాల: ఏప్రిల్ 10న భారీ సభ.. కేసీఆర్ హాజరు?

జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్‌లో ఏప్రిల్ 10న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉండగా, కేటీఆర్, హరీశ్ రావు త్వరలోనే సభా స్థలాన్ని సందర్శించనున్నారు. జీవన్ రెడ్డిని జగిత్యాల అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌గా నియమించే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.


