News March 19, 2024
కృష్ణా: చేపల చెరువులో విషప్రయోగం

బంటుమిల్లి మండలం రామవరపు మోడిలోని 3 ఎకరాల చేపల చెరువులో విషప్రయోగం కలకలం రేపుతోంది. బాధితుల వివరాల ప్రకారం.. గూడవల్లి లక్ష్మీ చేపల సాగు చేస్తున్నామన్నారు. కుమార్తె వివాహం కోసం నాలుగు రోజుల్లో చేపలు పట్టడానికి బేరం కుదుర్చుకున్నామని, ఈలోపే గుర్తు తెలియని వ్యక్తులు విషప్రయోగం చేయడంతో చేపలన్నీ చనిపోయాయని.. దాదాపు రూ. 7 లక్షల నష్టం జరిగిపట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 4, 2025
తిరువూరులో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరులో శుక్రవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజుపేటలో నివాసం ఉంటున్న షేక్ సుభాని అనే యువకుడు బైక్‌పై వెళ్తుండగా టిప్పర్ లారీ ఢీకొట్టడంతో స్పాట్‌లోనే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
News April 4, 2025
జిల్లాలో ఇసుక కొరత లేకుండా చర్యలు: కలెక్టర్

జిల్లాలో ఇసుక కొరత రానీయకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో గురువారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి ఆయన జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలుకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సమీక్షించారు.
News April 3, 2025
వారసత్వ సంపద గల నగరం మచిలీపట్నం: కలెక్టర్

మచిలీపట్నం నగరం వారసత్వ సంపద గల చారిత్రాత్మక నగరమని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. బందరు కోటను పర్యాటక సర్క్యూట్‌లో చేర్చేందుకు పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖల అధికారులతో కలిసి నగరంలోని బందరు కోట, డచ్ సమాధులను కలెక్టర్ పరిశీలించారు. తొలుత బందరుకోటను సందర్శించి చుట్టూ కలియ తిరిగారు.