News February 3, 2025
పుస్తకాలకు బదులు వ్యక్తుల కథలు తెలుసుకునే లైబ్రరీలు!
లైబ్రరీకి వెళ్లగానే ‘సైలెంట్ ప్లీజ్’ అనే బోర్డులు కనిపిస్తుంటాయి. కానీ, డెన్మార్క్‌లోని లైబ్రరీలలో వివిధ రకాల ప్రజల కథలు మారుమోగుతుంటాయి. పుస్తకాలకు బదులు అక్కడున్న వ్యక్తులను తీసుకెళ్లి, వారి జీవిత కథను వినొచ్చు. ప్రతి వ్యక్తికి ‘నిరుద్యోగి’, ‘శరణార్థి’లాంటి శీర్షికలు ఉంటాయి. వీరి కథలను విని ఒక పుస్తకాన్ని దాని కవర్ చూసి అంచనా వేయకూడదనే విషయాన్ని తెలుసుకుంటారు. దీనిని హ్యూమన్ లైబ్రరీ అంటారు.
Similar News
News February 3, 2025
ఇది రాహుల్ అవివేకానికి నిదర్శనం: కిషన్ రెడ్డి
యూపీఏ ప్రభుత్వంలోని వైఫల్యాలను ఎన్డీఏ ప్రభుత్వానికి ఆపాదించడం రాహుల్ గాంధీ అవివేకానికి నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో పదేళ్లలో 2.9 కోట్ల ఉద్యోగాల సృష్టి జరిగితే ఎన్డీఏ పాలనలో ఒక్క 2024లోనే 4.9 కోట్లు సృష్టించినట్లు ఆర్బీఐ నివేదిక పేర్కొందని Xలో తెలిపారు. వివిధ రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో పోలిస్తే NDA ప్రభుత్వంలోనే ఉపాధిలో వృద్ధి ఉందని వెల్లడించారు.
News February 3, 2025
వీటి పూర్తి పేర్లు మీకు తెలుసా?
నిత్యం ఏదోచోట మనం వినియోగించే వస్తువుల కంపెనీల ఫుల్‌ఫామ్స్ చాలా మందికి తెలియదు. అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం. TVS- తిరుక్కురుంగుడి వెంగారం సుందరం, SYSKA- శ్రీ యోగి సంత్ కృపా అనంత్, WIPRO- వెస్ట్రన్ ఇండియా పామ్ రిఫైన్డ్ ఆయిల్స్ లిమిటెడ్, HDFC- హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, PAYTM- పే థ్రూ మొబైల్, MRF- మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ. మీకు ఇంకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి.
News February 3, 2025
వైసీపీ ‘ఫీజు పోరు’ మార్చి 12కు వాయిదా
AP: విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని కోరుతూ, ఈనెల 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమాన్ని వైసీపీ మార్చి 12కి వాయిదా వేసింది. ఈ మేరకు Xలో ప్రకటన రిలీజ్ చేసింది. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరినా, ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదని పేర్కొంది.