News February 3, 2025
ఆజామ్ జాహి మిల్లుపై మావోయిస్టు పార్టీ లేఖ

వరంగల్ ఆజామ్ జాహి మిల్లు వస్త్ర పరిశ్రమకు చెందిన భూములపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ వెంకటేశ్ పేరుతో ములుగు జిల్లాలో లేఖ కలకలం సృష్టిస్తోంది. భూములపై పూర్తి హక్కు కార్మికులకు, వారి కుటుంబాలకు దక్కే వరకు పోరాటాలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. 2002లో 451 మంది కార్మికులకు బలవంతంగా వీఆర్ఎస్ ఇచ్చి మిల్లును మూసివేశారని తెలిపారు.
Similar News
News January 26, 2026
అరకులో పర్యటించనున్న సీఎం సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 29న అరకులోయ పర్యటనకు రానున్నట్లు అల్లూరి సీతారామరాజు కలెక్టర్ దినేష్ కుమార్ ఆదివారం తెలిపారు. అరకులోయలో ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు అరకు చలి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ ఉత్సవాల సందర్భంగా నిర్వహించే క్రీడా మైదానం తదితర ఏర్పాట్లను కలెక్టర్, ఐటీడీఏ పీఓ తిరుమణి పరిశీలించి వివరాలు వెల్లడించారు.
News January 26, 2026
రెబ్బెనలో భూవివాదం.. ముగ్గురిపై కేసు

రెబ్బెన మండలం రాజారాం గ్రామ శివారులో సర్వే నం.66లో రెండున్నర ఎకరాల్లో వివాదం కొంత కాలంగా కొనసాగుతోంది. ప్రభుత్వం ఇచ్చిన భూమిని సప్ప లక్ష్మి గత 25 ఏళ్లుగా సాగు చేస్తున్నామని అంటున్నారు. ఆ భూమి రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉందని, సాగు చేయొద్దని బీట్ అధికారి ఆయాజ్ అడ్డుకోవడంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. తనపై దాడి చేశారని FBO రెబ్బెన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
News January 26, 2026
కొత్త సినిమా ప్రకటించిన హీరో నితిన్

డైరెక్టర్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు హీరో నితిన్ ప్రకటించారు. ‘NO BODY NO RULES’ అంటూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. శ్రీనివాస చిట్టూరి ఈ మూవీని నిర్మించనున్నారు. ‘తమ్ముడు’ తర్వాత నితిన్ చేస్తున్న సినిమా ఇదే. కాగా VI ఆనంద్ గతంలో ‘టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం, డిస్కో రాజా, ఊరు పేరు భైరవకోన’ సినిమాలను తెరకెక్కించారు. ఈ మూవీ అయినా నితిన్‌కి హిట్ ఇస్తుందేమో చూడాలి.


