News February 3, 2025

ఆజామ్ జాహి మిల్లుపై మావోయిస్టు పార్టీ లేఖ

image

వరంగల్ ఆజామ్ జాహి మిల్లు వస్త్ర పరిశ్రమకు చెందిన భూములపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ వెంకటేశ్ పేరుతో ములుగు జిల్లాలో లేఖ కలకలం సృష్టిస్తోంది. భూములపై పూర్తి హక్కు కార్మికులకు, వారి కుటుంబాలకు దక్కే వరకు పోరాటాలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. 2002లో 451 మంది కార్మికులకు బలవంతంగా వీఆర్ఎస్ ఇచ్చి మిల్లును మూసివేశారని తెలిపారు.

Similar News

News July 6, 2025

రోజుకు 9 గంటల నిద్ర.. రూ.9 లక్షలు గెలిచింది

image

ఎక్కువ సమయం నిద్రపోతే బద్దకం వస్తుందని ఇంట్లో వాళ్లు తిడుతుంటారు. కానీ పుణేకు చెందిన పూజా రోజుకు 9 గంటలు నిద్రిస్తూ రూ.9.1 లక్షలు గెలిచారు. ఓ పరుపుల కంపెనీ నిర్వహించిన పోటీలో పాల్గొని, 60 రోజులు సగటున 9 గంటల పాటు ఎలాంటి ఆటంకం లేకుండా నిద్రించారు. నిద్రలేమిపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ఇంటర్న్‌షిప్‌లో లక్ష మందిలో 15 మంది తుదిపోరులో నిలిచారు. వీరిలో బెస్ట్ స్కోర్‌తో పూజా నగదు గెలిచారు.

News July 6, 2025

రాష్ట్రంలో ఊపందుకున్న బర్లీ పొగాకు కొనుగోళ్లు

image

AP: రాష్ట్రవ్యాప్తంగా HD బర్లీ పొగాకు కొనుగోళ్లు జరుగుతున్నాయని మార్క్‌ఫెడ్ ఎండీ ఢిల్లీరావు తెలిపారు. ఇంకొల్లు, పంగులూరు, పర్చూరు, బీకేపాలెం, చీరాల, గుంటూరు, పెదకాకాని, చిలకలూరిపేట, ఎడ్లపాడు, గుండ్లపల్లి కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయని చెప్పారు. రూ17.20 కోట్ల విలువైన 2245 బేళ్ల పొగాకు విక్రయాలు జరిగినట్లు వెల్లడించారు. రైతులకు డిజిటల్ చెల్లింపులు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

News July 6, 2025

‘రాష్ట్రంలో అనంత జిల్లా మొదటి స్థానంలో నిలవాలి’

image

మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0ని రికార్డ్ సృష్టించేలా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయం నుంచి పేరెంట్ టీచర్స్ మీటింగ్‌పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 10న సత్య సాయి జిల్లాలో జరిగే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్‌కి సీఎం చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉందన్నారు.