News February 3, 2025

గన్ మెన్ నాగరాజుకు అభినందించిన బాపట్ల కలెక్టర్

image

బాపట్ల జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో ప్రతిభ కనబరిచిన గన్ మెన్ నాగరాజును జిల్లా కలెక్టర్ వెంకట మురళి అభినందించారు. జిల్లా పోలీస్ గ్రౌండ్‌లో జరిగిన జిల్లా స్పోర్ట్స్ మీట్‌ అథ్లెటిక్స్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నాగరాజును సోమవారం జిల్లా కలెక్టర్ వెంకట మురళి అభినందించారు. కాగా నాగరాజు 4 బంగారు పతకాలు, ఒక సిల్వర్ పతకాన్ని గెలుపొందారు.

Similar News

News January 22, 2026

ఎండిన వారికి ఇనుము తిండి

image

తీవ్రమైన ఆకలితో శరీరం బలహీనంగా, ఎండిపోయి ఉన్న వ్యక్తికి ఇనుము ముక్కలను ఆహారంగా ఇస్తే ఎలా ఉంటుంది? ఇనుము తినడానికి పనికిరాదు, అది వారికి బలం ఇవ్వదు సరికదా, ప్రాణం పోయే ప్రమాదం ఉంది. ఏదైనా ఒక సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు దానికి ఉపశమనం కలిగించే పరిష్కారాన్ని సూచించాలి, అంతే తప్ప ఆ పరిస్థితిని మరింత దిగజార్చే పరిష్కారాన్ని సూచించకూడదని తెలిపే సందర్భంలో ఈ సామెత వాడతారు.

News January 22, 2026

కొద్దిమంది చేతుల్లోకే సంపద.. బిల్ గేట్స్ హెచ్చరిక

image

AI కారణంగా వైట్ కాలర్ జాబ్స్ ప్రమాదంలో పడతాయని మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ పేర్కొన్నారు. ‘ఐదేళ్లలో వైట్, బ్లూ కాలర్ జాబ్స్‌ని AI ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వాలు కొత్త స్కిల్స్ నేర్పించడం/టాక్స్ స్లాబ్స్‌లో మార్పులు చేయాలి. AI ఇప్పటికే సాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్, కాల్ సెంటర్స్‌లో లోయర్ స్కిల్ జాబ్స్ భర్తీ చేసింది. ఇలాగే సాగితే సంపద, అవకాశాలు కొద్దిమంది చేతుల్లోకే వెళ్లిపోతాయి’ అని హెచ్చరించారు.

News January 22, 2026

Night view: శ్రీశైలంలో రమణీయ దృశ్యం

image

శ్రీశైల మల్లికార్జున స్వామి క్షేత్రం రాత్రి వేళ విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలుగుతోంది. బుధవారం రాత్రి చిత్రీకరించిన రమణీయ దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుండటంతో భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలారు. ఈ అద్భుతమైన రాత్రి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఓం నమఃశివాయ!