News February 3, 2025

ఆజామ్ జాహి మిల్లుపై మావోయిస్టు పార్టీ లేఖ

image

వరంగల్ ఆజామ్ జాహి మిల్లు వస్త్ర పరిశ్రమకు చెందిన భూములపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ వెంకటేశ్ పేరుతో ములుగు జిల్లాలో లేఖ కలకలం సృష్టిస్తోంది. భూములపై పూర్తి హక్కు కార్మికులకు, వారి కుటుంబాలకు దక్కే వరకు పోరాటాలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. 2002లో 451 మంది కార్మికులకు బలవంతంగా వీఆర్ఎస్ ఇచ్చి మిల్లును మూసివేశారని తెలిపారు.

Similar News

News March 28, 2026

పీజీఆర్‌ఎస్ కార్యక్రమం రద్దు: కలెక్టర్

image

ఈనెల 30న నంద్యాల కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. అదే రోజు ఉదయం టిడ్కో గృహాల ప్రారంభోత్సవం, మధ్యాహ్నం పి-4 కార్యక్రమం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే డివిజనల్, మున్సిపల్, తహశీల్దార్ కార్యాలయాలలో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం ఉంటుందన్నారు.

News March 28, 2026

మాతృ, శిశు మరణాల నిర్మూలనే లక్ష్యం: కలెక్టర్

image

జిల్లాలో మాతృ, శిశు మరణాలను పూర్తిగా నిర్మూలించడమే ప్రధాన లక్ష్యమని కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు. శనివారం భీమవరం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జనవరి నుంచి మార్చి 2026 వరకు నమోదైన మాతృ, శిశు మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ కమిటీ సభ్యులతో చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. “జన్మిస్తూ శిశువు మరణించకూడదు” అనే సంకల్పంతో అధికారులు, వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని ఆదేశించారు.

News March 28, 2026

ఆదిలాబాద్: MATHS పరీక్షకు 18 మంది గైర్హాజరు

image

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. శనివారం మ్యాథమెటిక్స్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు పోలీసుల బందోబస్తు నడుమ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 52 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 10894 మంది విద్యార్థులకు గాను 10876 మంది విద్యార్థులు హాజరై 18 మంది గైర్హాజరైనట్లు అధికారులు పేర్కొన్నారు.