News February 3, 2025
గద్వాల ప్రజావాణిలో 28 దరఖాస్తులు.!

గద్వాల జిల్లాలో ప్రజావాణి ద్వారా వచ్చే దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. సోమవారం గద్వాల కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 28 మంది తమ సమస్యల పరిష్కరం కోసం దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు.
Similar News
News March 24, 2026
సామాన్యుడి వంటింట్లో పశ్చిమాసియా చిచ్చు..!

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు సామాన్యుడి వంట గదిని గుల్ల చేస్తున్నాయి. జనవరి నుంచి క్రమంగా పెరుగుతూ వస్తున్న ధరలు, మార్చి నాటికి భగ్గుమన్నాయి. సరఫరా గొలుసు దెబ్బతినడంతో లీటర్ సన్‌ఫ్లవర్ నూనె 175కు చేరగా, పామాయిల్ 145 వద్ద రికార్డు స్థాయిని తాకింది. నెల రోజుల్లోనే సన్‌ఫ్లవర్ ఆయిల్ పై 21 పెరగడం గమనార్హం. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తుండటంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.
News March 24, 2026
IPL: అత్యల్ప స్కోరు ఆర్సీబీదే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక స్కోరు(287) రికార్డు సన్ రైజర్స్ హైదరాబాద్ పేరిట <<19457522>>ఉంటే<<>>.. అత్యల్ప స్కోర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నమోదు చేసింది. 2017లో కోల్‌కతా(KKR)పై బెంగళూరు (RCB) చేసిన 49 రన్స్ నేటికీ లీగ్ చరిత్రలో అత్యల్పం. ఆ తర్వాత వరుసగా రాజస్థాన్ రాయల్స్ (58, 59), ఢిల్లీ (66, 67) పరుగులతో ఉన్నాయి. 2008లో ముంబై బౌలర్ల ధాటికి KKR కూడా 67 పరుగులకే కుప్పకూలింది.
News March 24, 2026
పశ్చిమాసియా సంక్షోభం.. కేంద్ర మంత్రుల కీలక భేటీ

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో పార్లమెంటు హౌస్‌లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కీలక భేటీ జరుగుతోంది. ఈ మీటింగ్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఎరువుల మంత్రి నడ్డా హాజరయ్యారు. మరోవైపు ఇదే అంశంపై రేపు ఆల్ పార్టీ మీటింగ్‌కు కేంద్రం <<19464829>>పిలుపునిచ్చిన<<>> విషయం తెలిసిందే.


