News February 3, 2025
NZB: బీజేపీ జిల్లా అధ్యక్షునిగా కులచారి దినేశ్

బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా కులచారి దినేశ్ రెండోసారి ఎన్నికయ్యారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి డా.కాసం వెంకటేశ్వర్లు ఓ ప్రకటన జారీ చేశారు. ఇటీవల జరిగిన సంస్థాగత ఎన్నికల సందర్భంగా దినేశ్ కులచారి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన రెండోసారి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. తనకు రెండోసారి అవకాశం కల్పించిన రాష్ట్ర నాయకులు కిషన్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News January 23, 2026
NZB: అండమాన్‌కు అజాద్ హిందూ పేరు పెట్టాలని కవిత లేఖ

అండమాన్‌కు అజాద్ హిందూ పేరు పెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి NZB మాజీ MP, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత లేఖ రాశారు. జాగృతి కూడా ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ల డిమాండ్‌ను సపోర్ట్ చేస్తోందన్నారు. తమకున్న నెట్‌వర్క్‌తో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ డిమాండ్ వచ్చేలా చేస్తామని లేఖలో పేర్కొన్నారు. అండమాన్ నికోబార్ పేరును బ్రిటీష్ వాళ్లు పెట్టారన్నారు.
News January 23, 2026
NZB: హై-టెక్ నైపుణ్యాలు అందాలన్నదే ప్రభుత్వ సంకల్పం: సుదర్శన్

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు హై-టెక్ నైపుణ్యాలు అందాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన స్కిల్ డెవలప్మెంట్ ఇనీషియేటివ్ ప్రోగ్రాంలో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.
News January 23, 2026
NZB: మేయర్ పీఠం కోసం కాంగ్రెస్, బీజేపీ కసరత్తు

మేయర్ పదవీ జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో నిజామాబాద్ మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, BJP తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. తమదే మేయర్ పీఠం అంటూ ఇరు పార్టీల నేతలు ఛాలెంజ్ చేస్తున్నారు. నోటిఫికేషన్ ముందే పూర్తిస్థాయిలో BJP, కాంగ్రెస్ హడావుడి మొదలైంది. కాంగ్రెస్ నుంచి సుమారు 700, బీజేపీ నుంచి 500 వరకు ఆశావహులు టికెట్ల కోసం దరఖాస్తులు చేసుకోవడంతో గెలిచే వారి కోసం సర్వేలు చేపట్టారు.


