News February 3, 2025
సంగారెడ్డి: రేపటి పరీక్ష ఈ నెల 10కి వాయిదా

సంగారెడ్డిలోని సైన్స్ మ్యూజియంలో మంగళవారం నిర్వహించనున్న భౌతిక రసాయన శాస్త్ర ప్రతిభ పరీక్ష ఈ నెల 10న నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. మండల స్థాయిలో గెలుపొందిన విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
Similar News
News April 16, 2026
తిరుపతి: లడ్డూ కల్తీ పదాలతో ప్రశ్న.. నిజమిదే!

ఏపి మోడల్ స్కూల్ 7వ తరగతి ప్రశ్నాపత్రంలో లడ్డూ కల్తీ అంశంపై ప్రశ్న ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై తిరుపతి, చిత్తూరు డీఈవోలను Way2News వివరణ కోరగా.. అలాంటి ప్రశ్న ఎక్కడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలో ఇలాంటి ప్రశ్న ఇవ్వకుంటే.. రాష్ట్రంలోనూ ఎక్కడా ఈ ప్రశ్న వచ్చే అవకాశం లేదన్నారు. ఇది ఎవరో సృష్టించిన మోడల్ పేపర్ అని స్పష్టం చేశారు.
News April 16, 2026
ASF: ప్రశ్నార్థకంగా కొమురం భీమ్ ప్రాజెక్టు..!

ASF(D)లోని 69 గ్రామాల్లో 45,500 ఎకరాల ఆయకట్టుకు నీరందించే 10.393TMCల సామర్థ్యం గల కొమురం భీమ్ ప్రాజెక్ట్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. 1,012 మీటర్ల పొడవున్న మట్టి ఆనకట్ట గట్టులో పగుళ్లు ఏర్పడడంతో 4ఏళ్లుగా కొట్టుమిట్టాడుతోంది. అయితే అధికారులు గట్టుపై పాలథీన్ కవర్లు కప్పడం గమనార్హం. CWC పరిశీలించినా శాశ్వత గ్రాటింగ్ పనులు నిధుల కొరత వల్ల పనులు నిలిచిపోయాయి. రూ.18కోట్లు మంజూరు చేసినా విడుదల కాలేదు.
News April 16, 2026
టీయూ పాలక మండలిలో కామారెడ్డి జిల్లాకు చోటు

రాష్ట్ర ప్రభుత్వం గురువారం టీయూ పాలకమండలిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కామారెడ్డి జిల్లా నుంచి మహమ్మద్ ఘాజీని పాలకమండలి సభ్యునిగా నియమించింది. ప్రస్తుతం ఆయన ప్రభుత్వ సలహాదారు ముహమ్మద్ షబ్బీర్ అలీ వద్ద పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సామాజిక సేవా రంగం(జర్నలిజం) విభాగంలో ఆయన్ను సభ్యునిగా నియమించారు. ఆయన నియామకం పట్ల షబ్బీర్ అలీతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు.


